MoviesTollywood news in telugu

1981లో సంక్రాంతి బరిలో పెద్ద చిత్రాల పోటీ….గెలిచింది ఎవరో…?

1981 Sankranti Big fight : సినిమాలకు సంబందించిన ఈ విషయం అయినా తెలుసుకోవటానికి అభిమానులు ముందు ఉంటారు. పండగ వస్తే ఇళ్ళ లోనే కాదు, సినిమా హాల్స్ దగ్గర కూడా సందడి పరుచుకుంటుంది. ఎందుకంటే కొత్త సినిమాలు రిలీజవుతాయి. అందునా పండగల్లో పెద్ద పండగ సంక్రాంతి అంటే ఇక చెప్పక్కర్లేదు.

సంక్రాంతికి రిలీజ్ చేయాలన్న ఉద్దేశ్యంతోనే చాలామంది షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తారు. దీంతో పెద్ద హీరోల సినిమాలు పోటాపోటీగా సంక్రాంతి బరిలో నిల్చిన చిత్రాలు ఎన్నో ఉన్నాయి. ఇక 1981లో చూస్తే, నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు,దర్శకరత్న దాసరి నారాయణరావు కాంబినేషన్ లో జనవరి 1న శ్రీవారి ముచ్చట్లు రిలీజై, ఘనవిజయం అందుకుంది. జయప్రద, జయసుధ హీరోయిన్స్. కాశ్మీర్ లో నాలుగు సాంగ్స్,10సీన్స్ తీశారు. మిగతా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలోనే చేసారు.

సాంగ్స్,సెంటిమెంట్ సీన్స్ కట్టిపడేయడంతో శ్రీవారి ముచ్చట్లు అందుకున్న విజయం ఫాన్స్ కి పండగ చేసింది. దీని తర్వాత 45రోజులకు అక్కినేని, దాసరి కాంబోలో వచ్చిన ప్రేమాభిషేకం 37సెంటర్స్ లో రిలీజై, 30సెంటర్స్ లో 100డేస్ ఆడింది. ఇక నటభూషణ్ శోభన్ బాబు నటించిన రెండు చిత్రాలు ఈ సంక్రాంతికి వచ్చాయి. జగమొండి మూవీలో పోలీసాఫీసర్ గా, రౌడీ విజయ్ గా డ్యూయల్ రోల్ చేసారు.

వి మధుసూదనరావు డైరెక్ట్ చేసిన ఈ మూవీ పెద్దగా ఆడలేదు. ఇక నటి విజయలలిత సొంత సినిమా దేవుడు మావయ్య మూవీలో శోభన్ బాబు హీరో. వాణిశ్రీ హీరోయిన్. కె వాసు డైరెక్టర్. ఇది 1980లో రిలీజవ్వలి. ఆర్ధిక కారణాల వలన ఆగిపోతే దాసరి చొరవతో 1981జనవరి 14న రిలీజయింది. పెద్దగా ఆడలేదు.ఇక సూపర్ స్టార్ కృష్ణ హీరోగా కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఊరికి మొనగాడు మూవీ జనవరి 14న రిలీజయింది.

వీరిద్దరి కాంబోలో వచ్చిన మొదటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఇది. జయప్రద హీరోయిన్. సాంగ్స్,మాటలు అన్నీ హిట్. 11సెంటర్స్ లో 100డేస్ ఆడింది. ఇది రిలీజైన నెలకు ప్రేమాభిషేకం రిలీజయింది. అయితే తన సత్తా చాటుకుని ఊరికి మొనగాడు నిలబడింది. చెన్నైలో జరిగిన శతదినోత్సవ వేడుకకు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్. కాగా జనవరి 15న రెబెల్ స్టార్ కృష్ణంరాజు నటించిన ఆడవాళ్ళూ మీకు జోహార్లు మూవీ లో మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ రోల్. జయసుధ హీరోయిన్. కె బాలచందర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఆడలేదు.