కార్తీకదీపం సినిమా గురించి నమ్మలేని నిజాలు…ఎన్ని కోట్ల లాభమో…?
Karthika Deepam Full movie Story :శోభన్ బాబు,శారద,శ్రీదేవి కల్సి నటించిన కార్తీకదీపం సినిమా అప్పట్లో సూపర్ హిట్. ఒకర్ని చేసుకుని,ఆమెకు తెలీకుండా ఇంకొకామెతో లవ్ ఎఫైర్ గల సినిమాలు చాలా వచ్చాయి. కానీ కార్తీక దీపం సినిమా అలాంటిదే అయినా కొత్తదనంతో తీశారు. పైగా ఇలాంటి సినిమాలకు శోభన్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా మారాడు.
నటుడు డాక్టర్ ఎం ప్రభాకర రెడ్డి కథతో రూపొందిన ఈ సినిమాకు లక్ష్మీ దీపక్ దర్శకత్వం వహించాడు. రోజులు మారాలి మూవీ మొదలుకుని ఏవండీ ఆవిడ వచ్చింది మూవీ వరకూ శోభన్ బాబుకి జోడీగా శారద నటించింది. రెండు నెలలముందు వచ్చిన బంగారు చెల్లెలు మూవీలో శోభన్ బాబు సిస్టర్ గా నటించిన శ్రీదేవి తొలిసారిగా కార్తీకదీపం లో శోభన్ సరసన హీరోయిన్ గా చేసింది.
నిజానికి శోభన్ బాబు సరసన శ్రేదేవిని తీసుకోడానికి దర్శక నిర్మాతలు సందేహించారట. హీరో ఒకే చెప్పడంతో కాదనలేకపోయారు. ఇక ఈ మూవీతో ఈ జంటకు జనం నీరాజనం పట్టడంతో ఆతర్వాత ఇద్దరూ కల్సి చాలా మూవీస్ లో చేసారు. ఇక అంతవరకూ గ్లామర్ పాత్రలకే పరిమితమైన శ్రీదేవి కార్తీకదీపం మూవీలో రాధ పాత్రతో నటన పరంగా మంచి పేరు తెచ్చుకుంది.
ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరైంది. 1979 ఫిబ్రవరి 2న చెన్నై వాహిని స్టూడియోలో షూటింగ్ స్టార్ట్ చేసారు.32రోజుల్లో 26లక్షల బడ్జెట్ తో పూర్తిచేశారు. జి రాధాదేవి గుప్తా, ఏ కృష్ణయ్య నిర్మించారు. ఇక ఈ మూవీ మే 10న సమ్మర్ లో రిలీజయింది. కార్తీకదీపం విజయవంతం కావడమే కాదు, కలెక్షన్స్ పరంగా కూడా రికార్డ్ క్రియేట్ చేసింది. 50రోజులకు 60లక్షలు వసూలు చేసిన సినిమాగా తెలుగు సినిమా చరిత్రలో ఓ రికార్డు.
అంతకుముందు ఇలా వసూలు చేసిన సినిమాలు మూడు ఉండగా, అందులో కార్తీకదీపం చేరింది. విజయవాడ కల్యాణ చక్రవర్తి 113రోజులకు 5లక్షల73వేల 804రూపాయలు వసూలు చేసింది. ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు ఈ థియేటర్ యజమాని. ఇందులో 100డేస్ ఆడిన మొదటి సినిమా ఇదే. 12సెంటర్స్ లో 100డేస్ ఆడడంతో ఆగస్టు 19న కల్యాణ చక్రవర్తి థియేటర్ లో 100డేస్ వేడుక చేసారు. ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్. శోభన్ బాబు నటనను ఎన్టీఆర్ ప్రశంసించారు.