MoviesTollywood news in telugu

మర్యాద రామన్న హీరోయిన్ ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా?

Telugu heroine saloni aswani :కమెడియన్ సునీల్ హీరోగా అవతారం ఎట్టి పలు సినిమాలు చేసాడు. అందులో దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తీసిన మర్యాదరామన్న మూవీ బ్లాక్ బస్టర్ హిట్. ఇందులో సునీల్ సరసన సలోని అశ్విని హీరోయిన్ గా చేసింది. కామెడీ ట్రాక్ తో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో నడిచే ఈ సినిమా కు జనం నీరాజనం పట్టారు. ఇక సునీల్,సలోని జంట బాగా కుదిరింది.

ఆతర్వాత సునీల్ హీరోగా పెద్దగా హిట్స్ లేకపోవడంతో మళ్ళీ కమెడియన్ గా స్థిరపడిపోయి, తన సినిమాలు తాను చేసుకుపోతున్నాడు. ఇక ఇప్పుడు సునీల్ విలన్ గా ఎక్కువ సినిమాలు చేస్తున్నాడు. ఇక సలోని విషయానికి వస్తే…

మహారాష్ట్రకు చెందిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ముంబైలో తన కుటుంబంతో కలిసి నివసిస్తోంది. ఆమె తండ్రి నార్కోటిక్స్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ కమిషనర్‌గా పని చేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి నటనపై మక్కువ ఉన్న సలోనిని.. ఆమె తల్లి ఎప్పుడూ ప్రోత్సహించింది. సలోనికి బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి పలు ఆఫర్లు వస్తున్నా.. ప్రాధాన్యత ఉన్న పాత్ర కోసం ఆమె ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."