ఈ పాలను తాగితే క్షణాల్లో నిద్రపోతారు…నిద్రలేమి సమస్య అనేది జీవితంలో ఉండదు
Good sleep Tips in telugu : ఈ రోజుల్లో చాలా మందికి నిద్రలేమి సమస్య ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. ఈ నిద్రలేమి సమస్యను అశ్రద్ధ చేస్తే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. నిద్రలేమి సమస్యతో బాధపడే వారికి ఆత్మవిశ్వాసం లోపించడం, డిప్రెషన్, ఆందోళన, కోపం, గందరగోళం, అతిగా తినటం వంటి అనేక రకాల లక్షణాలు కనిపిస్తాయి.

అంతేకాకుండా నిద్రలేమి సమస్య కారణంగా రోగ నిరోధక వ్యవస్థ బలహీనమవుతుంది దాంతో ఎన్నో రకాల ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఈ సమస్య నుంచి బయటపడటానికి తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుంటే మంచి ప్రయోజనం కనబడుతుంది. ఇప్పుడు చెప్పే ఈ పాలను రాత్రి పడుకొనే ముందు తాగితే మంచి నిద్ర పడుతుంది.

ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో పావు టీ స్పూన్ జాజికాయ పొడి, చిటికెడు యాలకుల పొడి, చిటికెడు పసుపు వేసి బాగా కలిపి పది నిమిషాలు అలా వదిలేసి ఆ తర్వాత ఆ పాలను వడగట్టి రాత్రి నిద్రపోయే ముందు తాగితే మంచి నిద్ర పడుతుంది.ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే క్రమంగా నిద్రలేమి సమస్య దూరం అవుతుంది.

రాత్రి పడుకునే ముందు నాలుగు లేదా ఐదు నానబెట్టిన బాదం పప్పులను తింటే మంచి నిద్ర పడుతుంది. బాదంపప్పులో మెగ్నీషియం సమృద్ధిగా ఉండటం వలన కండరాల రిలాక్స్ అయ్యి చక్కని నిద్ర పడుతుంది. అలాగే ట్రిప్టోఫాన్ అనేది కూడా నిద్రను ప్రేరేపిస్తుంది. బాదం పప్పును నీటిలో 5 గంటలు నానబెడితే సరిపోతుంది.

రాత్రి పడుకునే ముందు ఒక అరటిపండు తింటే మంచి నిద్ర పడుతుంది. అరటి పండులో పొటాషియం, మెగ్నీషియం సమృద్ధిగా ఉండటం వలన కండరాలకు ఉపశమనాన్ని అందిస్తాయి. అలాగే విటమిన్ b6 ఉండటం వలన శరీరంలో మెలటోనిన్ స్థాయిలను పెంచి నిద్రను ప్రేరేపించడంలో సహాయపడుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

