MoviesTollywood news in telugu

Venkatesh సుందరకాండ సినిమా హీరోయిన్ ఇప్పుడు ఎక్కడ ఎలా ఉందో తెలుసా?

Venkatesh Sundarakanda​ Movie Heroine :కొందరు సినిమాల్లోకి వచ్చినా కేవలం రెండే రెండు సినిమాలు చేసి గుడ్ బై చెప్పేస్తారు. అయితే ఆ సినిమాల్లో చేసిన ఫెరఫార్మెన్స్ వాళ్ళను కలకాలం గుర్తు పెట్టుకునేలా ఉండిపోతుంది. సరిగ్గా అపర్ణ విషయం చూస్తే అలానే ఉంటుంది. వెంకటేష్ హీరోగా వచ్చిన సుందరకాండ మూవీలో చిలిపి చేష్టలతో విద్యార్ధినిగా మంచి యాక్టింగ్ చేసి, చివరిలో గుండెలు పెండిసే సీన్లలో ఆడియన్స్ ని ఎమోషనల్ కి గురిచేసింది. తొలిచిత్రం అయినా అద్భుత నటనతో ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. ఆ ఆతర్వాత అక్క పెత్తనం – చెల్లెలి కాపురం సినిమాలో నటించిన అపర్ణ మళ్ళీ తెలుగు వెండితెరపై కనిపించలేదు.

అపర్ణ సొంతూరు బెంగళూరు. నిజానికి ఆమె తెలుగు ఫామిలీ అయినా,బెంగుళూరులో స్థిరపడ్డారు. తల్లి దండ్రులు ఇద్దరూ డాక్టర్లు కావడంతో పాటు వాళ్ళది ధనిక కుటుంబమే. అందుకే అపర్ణ రిచ్ గా పెరిగింది. ఎల్ కె జి నుంచి క్లాసికల్ డాన్స్ నేర్చుకున్న అపర్ణ ఎన్నో నాట్య ప్రదర్శనలు ఇచ్చింది. ఏకంగా 14ఏళ్ళు డాన్స్ నేర్చుకుంది. ఇక ఆమె 8వ తరగతి చదువుతున్న సమయంలోనే ఆమె ఫోటోలను చూసిన ప్రొడ్యూసర్ కెవివి సత్యనారాయణ సుందరకాండ మూవీలో ఛాన్స్ ఇచ్చారు.

నిజానికి ఈ సినిమా తమిళంలో రావడంతో అందులో రోజా పోషించిన పాత్రను చూపించి ఈవిధంగా యాక్ట్ చేయాలనీ సూచించారు. అలా తెలుగులో ఎంట్రీ ఇచ్చింది.సుందరకాండ సినిమా వెంకటేష్ కెరీర్ లో మంచి చిత్రంగా మిగిలిపోగా, అపర్ణ యాక్టింగ్ కి జనం నీరాజనం పట్టారు. దీని తర్వాత అక్కపెత్తనం – చెల్లెలి కాపురం మూవీ చేసిన అపర్ణ కి వరుస పెట్టి ఛాన్స్ లు వచ్చేసాయి.

అయితే స్టడీస్ దెబ్బతింటాయని, ఒక్కటి కూడా అంగీకరించకుండా బెంగుళూరు వెళ్ళిపోయింది. ఇక ఆ తర్వాత ఒక్క సినిమాలో కూడా కనిపించని అపర్ణ ఆర్ట్స్ లో గ్రాడ్యుయేషన్ చేసింది. 2002లో ఎన్ ఆర్ ఐ శ్రీకాంత్ ని లవ్ మేరేజ్ చేసుకుంది. అమెరికాలోని తెలుగువాళ్ళతో పాటు అమెరికన్స్ కి కూడా నాట్య విద్యను నేర్పిస్తూ ఆనందంగా కుటుంబంతో ఎంజాయ్ చేస్తోంది.

అయితే అపర్ణ సినిమాలకు గుడ్ బై చెప్పేసిందని తెల్సి మంచి నటి పరిశ్రమకు దూరం అయిందని అప్పట్లో దర్శక నిర్మాతలు చాలా బాధపడ్డారట. ఇక ఆడియన్స్ కూడా ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పడాన్ని తట్టుకోలేకపోయారు. ఎందుకంటే ఒకే ఒక్క సుందరకాండ సినిమాతో తెలుగు ఆడియన్స్ అభిమానులుగా మారిపోయారు.