MoviesTollywood news in telugu

ఒకే కథతో ఇద్దరు హీరోల సినిమాలు…ఏ సినిమా హిట్…?

Balakrishna bobbili simham movie : ఒకప్పుడు అయితే సినిమా కథల కోసం చాలా చర్చలు నడిచేవి. ఇప్పుడైతే పాతకథలకే కొన్ని మార్పులు చేసి తెరకెక్కిస్తున్నారు. కొన్ని ప్లాప్ అవుతున్నా, కొన్ని మాత్రం super హిట్ అవుతున్నాయి. ఒకప్పుడు ప్రేమాభిషేకం మూవీ సూపర్ హిట్ అయింది. కేన్సర్ వచ్చిన తొలిరోజుల్లో తీసిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. దర్శక రత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఈ మూవీలో శ్రీదేవి, జయసుధ హీరోయిన్లుగా నటించారు.

దేవదాసు సినిమాలో పార్వతి, చంద్రముఖిలను ప్రేరణగా తీసుకొని దాసరి నారాయణ రావు ప్రేమాభిషేకం తెరకెక్కించారు. ఈ సినిమాలో హీరోకి క్యాన్సర్ అని తెలియడంతో ఆ విషయాన్ని దాచిపెట్టి హీరోయిన్ కి వేరే వివాహం జరిగేలా హీరో ప్రవర్తిస్తాడు. ఇందులోని అక్కినేని నటనకి ప్రేక్షకులు నీరాజనం పట్టారు.1981 ఫిబ్రవరి 18న విడుదలైన ఈ మూవీ రికార్డులు సృష్టించడమే కాదు, కాసుల వర్షం కురిపించింది.

ప్రేమాభిషేకం సినిమా వచ్చిన 13 ఏళ్ళ తర్వాత ఇదే కథని కొద్దిగా మార్పులు చేసి రచయిత విజయేంద్రప్రసాద్ అందించిన కథ ఆధారంగా బొబ్బిలి సింహం పేరుతో దర్శకుడు కోదండరామిరెడ్డి తెరకెక్కించారు బాలకృష్ణ, మీనా, రోజా ప్రధానపాత్రలో వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అనిపించుకుంది. ఈ సినిమాలో హీరోకి బదులుగా హీరోయిన్ కి క్యాన్సర్ పెట్టి దానిని దాచిపెట్టి హీరోకి హీరోయిన్ మరో పెళ్లి చేస్తుంది.