Healthhealth tips in telugu

మీ ఇంటి చుట్టు పక్కల ఉండే ఈ తీగ ఎంత మేలు చేస్తుందో తెలుసా…అసలు నమ్మలేరు

Doosara theega upayogalu :ఇప్పుడు చెప్పే తీగ గ్రామాల్లో ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంది. పొదలపై ఈ తీగ అల్లుకుంటుంది. దీని పేరే దూసర తీగ. దీని గురించి పెద్దగా తెలియక మనలో చాలామంది పిచ్చి మొక్కగా భావిస్తారు. కానీ వీటిలో కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. చర్మ సమస్యలను తగ్గించడంలో ఈ ఆకులు చాలా బాగా సహాయపడుతాయి.
doosara-theega-upayogalu
ఈ ఆకుల రసాన్ని చర్మంపై దద్దుర్లు, దురద,గజ్జి వంటి సమస్యలు ఉన్న ప్రదేశంలో రాస్తే తొందరగా తగ్గుముఖం పడతాయి. శరీరంలో అధికంగా వేడి ఉంటుంది. అలాంటి వారికి ఈ దూసర తీగ ఆకుల నుంచి పసరు తీయాలి. దీన్ని ఒక ఐదు గంటల పాటు అలాగే వదిలేయాలి. అప్పుడు జెల్ తయారవుతుంది. దీనిలో కొంచెం పటికబెల్లం వేసి తీసుకోవాలి. ఈ విధంగా రెండు రోజులకోసారి చేస్తూ ఉంటే శరీరంలో వేడి తగ్గుతుంది
Diabetes diet in telugu
డయాబెటిస్ ఉన్న వారికి కూడా ఈ ఆకులు చాలా బాగా సహాయపడుతాయి. ఈ ఆకులను నీటిలో బాగా మరిగించి ఆ నీటిని వడకట్టి తాగాలి. ఈ విధంగా తాగుతూ ఉంటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఈ ఆకుల రసాన్ని రోజూ తాగితే స్త్రీ, పురుషుల్లో హార్మోన్ల సమస్యలు తగ్గుతాయి. ఈ ఆకుల్లో కాల్షియం సమృద్దిగా ఉండుట వలన మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు, అరికాళ్ళ మంటలు వంటివి తగ్గుతాయి.
Joint Pains
ఈ ఆకుల రసం తరచూ తీసుకోవడం వల్ల కాళ్లలోని ఎముకలు కూడా గట్టిగా ఉంటాయి. దూసర తీగ ఆకులు అందుబాటులో లేకపోతే, ఆ ఆకులు దొరికినప్పుడు వాటిని శుభ్రంగా కడిగి ఎండబెట్టి పొడి చేసుకొని నిల్వ చేసుకొని వాడు కోవచ్చు. ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో పావుస్పూన్ పొడి వేసి బాగా కలిపి తీసుకోవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

div style=”background-color: #f0f9eb; border-left: 5px solid #4caf50; padding: 15px; margin: 20px 0; border-radius: 5px;”>Also Read:

“రోజూ ఒక సపోటా తింటే మీ శరీరంలో జరిగే అద్భుతాలు తెలుసా? తెలిస్తే అస్సలు వదలరు!”

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."