ఒక చిటికెడు పొడితో ఇలా చేస్తే గొంతులో గర గర, గొంతు నొప్పి, గొంతు ఇన్ ఫెక్షన్ తగ్గిపోతాయి
Throat irritation : గొంతులో విపరీతమైన నొప్పి ఉన్నప్పుడు తినటానికి,తాగటానికి,మాట్లాడటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాగే విపరీతమైన నొప్పి వస్తుంది. నొప్పితో పాటు గొంతులో గరగర,ఇన్ఫెక్షన్స్, ఇరిటేషన్ వంటివి కూడా వస్తాయి. ఈ సమస్యలు తక్కువగా ఉంటే ఇప్పుడు చెప్పే చిట్కా చాలా బాగా పనిచేస్తుంది.
సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం డాక్టర్ సూచనలను పాటిస్తూ ఇప్పుడు చెప్పే చిట్కా పాటిస్తే చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది. ఈ సమస్య తగ్గటానికి మన వంటింటిలో ఉండే పసుపు బాగా సహాయపడుతుంది. పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి పావు స్పూన్ పసుపు వేసి రెండు నిమిషాల పాటు మరిగించాలి.
మరిగిన ఈ నీటిని గోరువెచ్చగా ఉన్నప్పుడే నోట్లో పోసుకొని గార్గిలింగ్ చేయడం లేదా పుక్కిలించడం చేయాలి. పుక్కిలించిన తర్వాత నీళ్ళని బయటకి ఊసేయాలి. ఈ విధంగా రోజులో మూడు నుంచి నాలుగు సార్లు చేయాలి. ఇలా చేస్తూ కాచి చల్లార్చిన నీటిని తాగాలి. గొంతు భాగంలో ఉండే మజిల్స్ రిలీఫ్ అవుతాయి. గొంతు నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.
ఈ పసుపు నీటిని తాగటం వలన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఎటువంటి ఇన్ ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది. కాలేయం పని తీరును దెబ్బతీసే తీవ్రమైన సిరోసిస్ వ్యాధి నుంచి రక్షణ కల్పిస్తుంది.పసుపులో ఉండే ‘కర్కుమిన్’ అనే పదార్థం కాలేయం కణాల్ని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది.పసుపులో ఉండే వర్ణకం పిత్త వాహికల్లో ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా చూస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.