Venkatesh Maha: KGF సినిమా కథ లో హీరో రాకీ పాత్ర ను మాత్రమే దూషించిన వెంకటేష్ మహా…

Venkatesh Maha:  తమ హీరో ను దూషించాడు అని అనుకుని, KGF అలాగే హీరో యష్ ఫ్యాన్స్ తెలుగు యువ దర్శకుడు వెంకటేష్ మహా పై విరుచుకు పడుతున్నారు.అయితే తాను కధ, కథనం మరియు కధ హీరో పాత్ర రాకీ ను చిత్రీకరించిన విధానం ను మాత్రమే నిందించినట్లు వెంకటేష్ మహా వివరణ ఇచ్చుకున్నారు.

హీరో రాకీ గని కార్మికులకు ఇళ్ళు ఇవ్వడం లాంటి అల్ప సహాయం చేసి, బంగారం కడ్డీ లను మాత్రం వారికి ఇవ్వకుండా తీసుకెళ్ళి నట్ట నడిసముద్రంలో ముంచేయడం లాంటి సన్నివేశాలు తనకు ఏ మాత్రం నచ్చలేదని తెలిపాడు. అలాగే చిన్నతనం లో హీరో కు తల్లి ఇచ్చిన స్ఫూర్తి నేటి యువతకు ఏ మాత్రం స్ఫూర్తి దాయకం కాదనే తన ఉద్దేశం తెలిపాడు.

తన ఉద్దేశం లో అసహనం పాళ్లు ఎక్కువ అవడంతో దూషణ కనబడింది అని కొంతమంది నెటిజన్లు భావన.