స్టార్ హీరోయిన్ ని గుర్తు పట్టారా…అయితే వెంటనే చూసేయండి

Tollywood heroine Rashmika Mandanna:ప్రస్తుతం తెలుగులో హీరోయిన్స్ అందరూ ఇతర భాషల నుంచి వచ్చిన భామలే కనిపిస్తారు. అలాగే కన్నడ బ్యూటీ రష్మిక మందన్న తెలుగులో ప్రముఖ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ‘ఛలో’ చిత్రం ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ అమ్మడు సినీ పరిశ్రమకు వచ్చిన అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ ఇమేజ్ ను సొంతంచేసుకుని అగ్ర ప్రధాన దూసుకెళ్తోంది.
Tollywood Heroine rashmika mandanna
రష్మిక సోషల్ మీడియా మాధ్యమాలలో యాక్టివ్ గా ఉంటోంది. తాజాగా రష్మిక మందన్న తన చిన్నప్పటి జ్ఞాపకాలని గుర్తు చేసుకుంది. ఇందులో భాగంగా 2001వ సంవత్సరంలో గోకులం అనే మ్యాగ్ జైన్ కవర్ ఫోటో కి ఫోజులు ఇచ్చిన విషయం గురించి కూడా పలు ఆసక్తికర అంశాలను తెలిపింది.

ఇక ఈ విషయానికి సంబంధించి ఫోటోని కూడా అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. తాను మ్యాగ్ జైన్ కవర్ ఫోటో కోసం షూటింగ్ లో పాల్గొన్న మొదటి రోజు ఇప్పటికీ చాలా బాగా గుర్తు ఉందని, అంతేగాక తాను షూటింగ్ లో పాల్గొన్న మొదటి రోజు జ్ఞాపకాలని తన తల్లి ఇప్పటికీ పదిలంగానే ఉంచిందని చెప్పుకొచ్చింది. ఈ ఫోటో షేర్ చేసిన గత కొద్ది రోజుల్లోనే ఎక్కువగా లైకులు వచ్చాయి.అంతేకాక నెటిజన్లు ఈ ఫోటో బాగా వైరల్ చేసారు.