రోజుకి 2 సార్లు నాకితే చాలు దగ్గు,గొంతు నొప్పి, ఇన్ ఫెక్షన్ అన్నీ తగ్గిపోతాయి
Antioxidant Syrup : దగ్గు వచ్చిందంటే ఒక్క పట్టానా తగ్గదు. చాలా చిరాకు కూడా వస్తుంది. దగ్గు,గొంతు నొప్పి, ఇన్ ఫెక్షన్ తగ్గటానికి మందులు వాడుతూ ఇప్పుడు చెప్పే చిట్కా పాటిస్తే చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది. ఈ చిట్కా కోసం కేవలం రెండు ఇంగ్రిడియన్స్ ఉపయోగిస్తున్నాం. కాస్త ఓపికగా చేస్తే మంచి ఫలితం వస్తుంది.
పది తులసి ఆకులను శుభ్రంగా కడిగి రసం తీయాలి. ఈ రసంలో కొంచెం తేనె వేసి బాగా కలిపి అరచేతిలో వేసుకొని నాకాలి. ఈ విధంగా రోజులో రెండు సార్లు చేస్తే గొంతులో నొప్పి ఇరిటేషన్ వెంటనే తగ్గుతుంది. త్రోట్ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. దగ్గు తగ్గుతుంది. సమస్య చిన్నగా ఉన్నప్పుడూ ఇలాంటి చిట్కాలు బాగా సహాయపడతాయి.
ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో దగ్గు,జలుబు, గొంతు నొప్పి వంటివి వచ్చినప్పుడు ఇంటి చిట్కాలను పాటిస్తే చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది. తులసిలో ఉన్న లక్షణాలు దగ్గుని తగ్గించటంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. తులసి చెట్టు దాదాపుగా ప్రతి ఇంటిలోనూ ఉంటుంది. స్థలం లేనివారు కూడా కుండిల్లో పెంచుకుంటున్నారు.
ఇక తేనె విషయానికి వస్తే తేనెలో ఉండే యాంటీ బ్యాక్టీరియాల్ లక్షణాలు, యాంటీ ఆక్సిడెంట్స్ వంటివి దగ్గును,గొంతు నొప్పిని తగ్గించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. తేనె ఆర్గానిక్ తేనె అయితే చాలా మంచిది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.