ఈ ఆకులతో టీ తాగితే చెడు కొలెస్ట్రాల్, అధిక బరువు,డయాబెటిస్ అనేవి అసలు ఉండవు
curry leaves Tea Benefits In telugu : మనం ప్రతి రోజు కూరల్లో కరివేపాకు వాడుతూ ఉంటాం. కొంత మంది కూరల్లో వేసిన కరివేపాకును తీసి పాడేస్తూ ఉంటారు. మరి కొంతమంది కరివేపాకును తింటూ ఉంటారు. ఈ మధ్యకాలంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగి ప్రతి ఒక్కరూ ఇంటిలో కరివేపాకు మొక్కను పెంచుకుంటున్నారు. .
స్థలం లేకపోయినా కుండీల్లో అయినా పెంచుకుంటున్నారు. ప్రతి రోజు నాలుగు లేదా ఐదు కరివేపాకు ఆకులను తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తొలగించడానికి కరివేపాకు చాలా బాగా సహాయపడుతుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే రక్త ప్రవాహానికి అడ్డుపడి గుండెకు సంబంధించిన సమస్యలు వస్తాయి. .
అందువలన చెడు కొలెస్ట్రాల్ సమస్యలను తొలగించుకోవడానికి కరివేపాకుతో టీ తయారు చేసుకుని తాగితే చాలా మంచి ప్రయోజనం కనబడుతుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గటమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి శుభ్రంగా కడిగిన పది కరివేపాకు ఆకులను వేసి ఐదు నుంచి ఏడు నిమిషాలు మరిగించాలి. మరిగిన ఈ నీటిని గ్లాసులో వడగట్టాలి.
ఈ నీటిలో ఒక స్పూన్ అల్లం రసం,అరస్పూన్ తేనె కలిపి ప్రతి రోజు తీసుకుంటూ ఉంటే రక్తంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ మొత్తం తొలగిపోయి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కరివేపాకుతో తయారుచేసిన టీ తాగటం వలన ఈ సీజన్లో వచ్చే దగ్గు, జలుబు, గొంతునొప్పి వంటి శ్వాస కోశ సమస్యలు అన్ని తొలగిపోతాయి.
అయితే డయాబెటిస్ ఉన్నవారు తేనె లేకుండా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అలాగే అధిక బరువు సమస్యతో బాధపడేవారు ఉదయం పరగడుపున కరివేపాకుతో తయారు చేసిన టీ తాగితే శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వు కరిగి అధిక బరువు సమస్య నుంచి బయటపడతారు.
అంతేకాకుండా శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. కరివేపాకులో ఉండే పోలిక్ యాసిడ్ మరియు ఐరన్ అనేవి రక్తహీనత సమస్యను తగ్గిస్తాయి. కాబట్టి ఇప్పుడు చెప్పిన సమస్యలు ఉన్నవారు ప్రతిరోజు ఒక 15 రోజులపాటు కరివేపాకుతో తయారు చేసిన టీ తాగితే మంచి ప్రయోజనం కనబడుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.