MoviesTollywood news in telugu

మధురానగరిలో సీరియల్ నటి కీర్తి రియల్ లైఫ్…ఎన్ని కష్టాలో …?

Madhuranagarilo serial actress: మనసిచ్చి చూడు సీరియల్ తో తెలుగు బుల్లితెరకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి భ‌ట్..ఆ తర్వాత చాలా సక్సెస్ గా ముందుకు సాగుతుంది. తన అభినయంతో, అందంతో ఆడియన్స్ మనసు దోచుకుంది. తెలుగు బుల్లితెరపై చేసిన  తొలి సీరియల్ అయినప్పటికీ ఆడియన్స్ లో తనదైన ముద్రవేసింది.

కీర్తి భ‌ట్ బెంగుళూరులో జూన్ 2న జన్మించిన ఈమె బిబిఎం కోర్సు పూర్తిచేసింది. ఈమెకు చిన్నతనం నుంచి యాక్టింగ్, డాన్సింగ్ మీద చాలా మక్కువ. కారు ప్రమాదంలో తల్లిదండ్రులను,అన్నయ్యను కోల్పోయిన ఈమె చాలా బాధను చవిచూసింది. తనకు తానె సర్దిచెప్పుకుని, గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక నటన మీద ఆసక్తితో కన్నడ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కీర్తి భ‌ట్ రెండు సినిమాలు,మూడు సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ది క్రైస్ట్ సేవ్ యు మూవీలో నటించి టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం మ‌ధురాన‌గ‌రిలో డైలీ సీరియ‌ల్ లో నటిస్తూ చాలా మంది అభిమానులను సంపాదించుకుంది. బిగ్‌బాస్ సీజ‌న్ 6తో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న‌ది కీర్తిభ‌ట్‌. సెకండ్ ర‌న్న‌ర‌ప్‌గా నిలిచి ప్రేక్ష‌కాభిమానాన్ని చూర‌గొన్న‌ది.