యూరిక్ యాసిడ్ ఉన్నవారు అరటిపండు తింటే ఏమి అవుతుందో తెలుసా ?
Uric Acid Banana Home Remedies in Telugu : మన శరీరంలో యూరిక్ యాసిడ్ అనేది ఉంటుంది. యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగినప్పుడు సమస్యలు వస్తాయి. ఆ స్థాయిలు ఎక్కువగా ఉంటే చేతి వేళ్ళకు వాపులు రావటం,కీళ్ల నొప్పులు వస్తాయి. యూరిక్ యాసిడ్ కీళ్ల మధ్యకు చేరినప్పుడు కీళ్లలో మంట మరియు నొప్పి కలుగుతుంది.
శరీరంలో ఉత్పత్తి అయ్యే యూరిక్ యాసిడ్ చాలా వరకు రక్తంలో కరిగి మూత్రపిండాల ద్వారా విసర్జించబడుతుంది. శరీరంలో యూరిక్ యాసిడ్ అధికంగా ఉండటం వల్ల, కిడ్నీపై ఎక్కువ ఒత్తిడి పెరుగుతుంది. దాని కారణంగా అది ఫిల్టర్ చేయలేకపోతుంది. ఈ యాసిడ్ కీళ్ళలో పేరుకు పోతుంది. కాబట్టి దాన్ని తగ్గించుకోవటం చాలా ముఖ్యం. యూరిక్ యాసిడ్ ని పెంచే ఆహారాలకు దూరంగా ఉండాలి.
అలాగే యూరిక్ యాసిడ్ ని నియంత్రణలో ఉంచే ఆహారాలను తీసుకోవాలి. యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు అసలు అశ్రద్ద చేయకుండా డాక్టర్ ని సంప్రదించాలి. డాక్టర్ సూచనలను పాటిస్తూ ఇంటి చిట్కాలను ఫాలో అవ్వవచ్చు. యూరిక్ యాసిడ్ స్థాయిలను నియంత్రణలో ఉంచటానికి అరటిపండు సహాయపడుతుంది. ప్రతి రోజు ఒక అరటిపండ్లను తింటే యూరిక్ యాసిడ్ స్థాయిలు తగ్గుతాయి.
ఒక అరటిపండులో దాదాపు 105 కేలరీలు ఉంటాయి. అలాగే చక్కెర తక్కువగా ఉంటుంది. కానీ విటమిన్లు B6, విటమిన్ C, ఫైబర్, మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్ మరియు పొటాషియం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గిస్తుంది. అరటిపండ్లు యూరిక్ యాసిడ్‌ను ద్రవ రూపంలోకి మార్చి మూత్రపిండాల ద్వారా ఫిల్టర్ చేసి మూత్రం ద్వారా బయటకు పంపుతుంది.
కీళ్ల మధ్య స్పటికాలు ఏర్పడకుండా సహాయపడుతుంది. ఒక అరటిపండులో 24 mcg ఫోలేట్ లేదా ఫోలిక్ యాసిడ్ ఉంటుంది, ఇది యూరిక్ యాసిడ్ స్థాయిలను నియంత్రించడంలో మరియు కీళ్లలో విరిగిన కణజాలాన్ని సరిచేయడంలో సహాయపడుతుంది. ఇంకా, వాటిలో 10.3 mg విటమిన్ సి ఉంటుంది, ఇది ఆరోగ్యకరమైన యూరిక్ యాసిడ్ స్థాయిలను అందించడంలో సహాయపడుతుంది
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.