పదో తరగతి పాసవడానికి రానా ఎన్ని కష్టాలు పడ్డాడో తెలుసా?
Tollywood Hero Rana :రానా దగ్గుబాటి..ఓ విలక్షణ నటుడు. ఆయన ఇటీవల ఓ టాక్ షోలో పాల్గొన్నారు. ఆ షోలో రానా మాట్లాడుతూ…కొన్ని ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. తన సహ నటుడు ప్రభాస్‌కు ఓపిక ఎక్కువని, ఆయనలో తనకు అది చాలా ఇష్టమని నటుడు అన్నారు రానా. అంతేకాకుండా.. ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితం గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఆయన మాట్లాడుతూ.. చదువులో ముందుండాలని ఎప్పుడూ అనుకోలేదని, తనకు ఫిల్మ్‌మేకింగ్ మీద ఆసక్తి ఎక్కువని అన్నారు. అందువల్లే తాను పదిలో ఫెయిల్ అయ్యానని..అన్నారు.అయితే పదిలో పాసవడానికి చాలా కష్టపడాల్సీ వచ్చిందన్నారు.
నా చదువు గురించి.. ‘మా తాతయ్య రామానాయుడు గారు ఎప్పుడూ ఆందోళన చెందలేదు.ఎందుకంటే..నాకు ఎడిటింగ్ అంటే ఇష్టమని, దాన్ని నేర్చుకుంటున్నానని ఆయనకు తెలుసు అన్నారు. అందుకే నాకు ఆసక్తి ఉన్న రంగంలో రాణిస్తే మంచిదని ఆయన అనుకున్నారు. అయితే తాను పదో తరగతిలో ఫెయిల్ అయ్యానని… ఆ తర్వాత పాస్ అవడానికి చాలా స్కూల్స్ మారాల్సీవచ్చిందన్నారు.
అలా స్కూల్స్ మారుతున్నప్పడే.. రామ్ చరణ్ స్నేహితుడయ్యాడని అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ..మా తాతగారు నిర్మాత కావడంతో చిత్ర పరిశ్రమలో రాణించేందుకు నాకు సులభం అయ్యిందని… అంతేకాదు నాకు నచ్చిన కథను ఎంచుకునే అవకాశం దక్కిందని… ఇందంతా మా తాత వల్లే సాధ్యమైందని చెప్పుకొచ్చారు.