MoviesTollywood news in telugu

ఆ రోజుల్లో వీళ్లు తీస్కున్న రెమ్యునరేషన్ తెలిస్తే… వామ్మో అంతా అంటారు

Tollywood Old Actors remunaration:సినిమా హీరోలు అనగానే ఈ రోజుల్లో పారితోషికం వారి సినిమాల హిట్ ని బట్టి ఉంటుంది. ఒక్క హిట్ పడితే చాలు పారితోషికం అమాంతం ఆకాశాన్ని అందుకుంటుంది. ఇది ఈ రోజుల్లో సర్వసాధారణం అయ్యిపోయింది. అప్పటి తరం నటులు నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు వంటి నటులు ఆ రోజుల్లో ఎంత పారితోషికం తీసుకొనేవారో మీకు తెలుసా? చిత్తూరి నాగయ్య లక్ష రూపాయిలు తీసుకొనేవారు. 
Ntr And Anr Age
NTR,ANR వంటి వాళ్ళు మొదట్లో నెలకు 600 వరకు తీసుకొనేవారు. ఆ తర్వాత సినిమాకి 70000 వరకు తీసుకొనేవారు. ఎన్టీఆర్ చివరి సినిమా వచ్చేసరికి పారితోషికం 18 లక్షలు తీసుకున్నారు. ANR అయితే ప్రేమాభిషేకం వరకు 15 లక్షలకే పరిమితం అయ్యారు. సీతారామయ్య మనవరాలు సినిమా వచ్చేసరికి 30 లక్షలు తీసుకున్నారు. 
tollywood super star krishna
సూపర్ స్టార్ కృష్ణ మొదటి సినిమా 3000 రూపాయిలు తీసుకున్నాడు. 70 లోకి వచ్చేసరికి లక్షన్నరకు పెంచారని అంటూ ఉంటారు. 80 లోకి వచ్చేసరికి సూపర్ స్టార్ సినిమాలు బాగా వసూళ్లు చేసిన చాలా రోజుల వరకు రెండు లక్షల పారితోషికాన్ని మాత్రమే తీసుకున్నారు. వారసుడు సినిమా సమయంలో 25 లక్షలు తీసుకున్నారు. నెంబర్ వన్,అమ్మదొంగా సినిమాల స్థాయికి వచ్చేసరికి 50 నుంచి 70 లక్షల వరకు తీసుకున్నారు. 
chiranjeevi
ఇక చిరంజీవి విషయానికి వస్తే దక్షిణ భారత దేశంలో కోటి రూపాయిలు అందుకున్న మొదటి హీరో చిరంజీవి. శోభన్ బాబు 80 లలో సినిమాకి 7 నుంచి 8 లక్షల వరకు తీసుకునేవాడు. కృష్ణంరాజు విషయానికి వస్తే బొబ్బిలి బ్రహ్మన్న హిట్ కావటంతో 25 లక్షల వరకు తీసుకునేవాడు. ఆ తర్వాత పారితోషికం తగ్గిపోయింది. 

శోభన్ బాబు,చిరంజీవి,ఎన్టీఆర్ లకు మాత్రమే నిర్మాతలు చెప్పినట్టు పారితోషికం ఇచ్చేవారని అప్పట్లో వార్తలు వచ్చాయి. వారు అంత ఖచ్చితంగా ఉండేవారు. మిగతా వారు నిర్మాతలు ఎంత ఇస్తే అంత తీసుకొనేవారు.