ఆ సమస్యలు ఉన్నవారు వెల్లుల్లి తింటే ఏమి అవుతుందో తెలుసా…అసలు నమ్మలేరు
Garlic side effects in telugu :మనం ప్రతి రోజు వెల్లుల్లిని వాడుతూ ఉంటాం. వెల్లుల్లి ఆహారానికి రుచి ఇవ్వటమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వెల్లుల్లి తింటే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వెల్లుల్లిలో ఆల్లిసిన్, సల్ఫర్, యాంటీ వైరల్ యాంటీ ఫంగల్ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. వెల్లుల్లి ఎక్కువగా తింటే కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

తల నొప్పి సమస్య ఉన్నప్పుడు వెల్లుల్లి ఎక్కువగా తీసుకుంటే తలనొప్పి పెరిగే అవకాశం ఉంది. చాలామంది తలనొప్పి వచ్చినప్పుడు వెల్లుల్లిని ఔషధంగా తీసుకుంటుంటారు. లిమిట్ గా తీసుకుంటే పరవాలేదు. ఎక్కువగా తీసుకుంటే తలనొప్పి ఎక్కువ అవుతుంది. పొట్టకు సంబంధించి సమస్యలు ఉన్నవారు వెల్లుల్లిని ఎక్కువగా తీసుకోకూడదు.

ఎక్కువగా తీసుకుంటే ఎసిడిటీ సమస్య వస్తుంది. కొన్నిసార్లు అది తీవ్రం కూడా కావచ్చు. నోటి దుర్వాసన ఉన్నవారు కూడా వెల్లుల్లికి దూరంగా ఉంటేనే మంచిది. నోటి దుర్వాసనకు వేరే .ఇంటి చిట్కాలను ఫాలో అవడం మంచిది.ఎందుకంటే వెల్లుల్లి నోటి దుర్వాసనను పెంచే అవకాశం ఉంది. వెల్లుల్లిలో సల్ఫర్ ఎక్కువగా ఉండటం వల్ల ఎలర్జీ ఈ సమస్యలకు కారణం కావచ్చు.

కాబట్టి అలర్జీ సమస్యలు ఉన్నవారు వెల్లుల్లి వాడకానికి కాస్త దూరంగా ఉంటేనే మంచిది. ఏదైనా మితంగా తింటేనే మనకు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. కాబట్టి వెల్లుల్లిని ఎక్కువగా తీసుకోకుండా లిమిట్ గా తీసుకొని వాటిలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలను పొందండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

