Beauty TipsHealth

White Hair:ఇలా చేస్తే 10 నిమిషాల్లో తెల్లజుట్టు మొత్తం నల్లగా మారిపోతుంది…జీవితంలో తెల్లజుట్టు ఉండదు

White Hair Home Remedies tips :ఈ మధ్య కాలంలో జుట్టుకు సరైన పోషణ లేకపోవటం,వాతావరణంలో కాలుష్యం,ఒత్తిడి,సరైన పోషకాలు ఉన్న ఆహారం తీసుకోకపోవటం వంటి అనేక రకాల కారణాలతో తెల్లజుట్టు సమస్య వంటి ఎన్నో రకాల జుట్టుకి సంబందించిన సమస్యలు వస్తున్నాయి. చాలా మందికి చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం జరుగుతుంది.

దాంతో వయస్సుకి మించి కనపడతారు. దాంతో జుట్టుకి రంగు వేయటం ప్రారంభిస్తారు. ఇలా రంగు వేయటం వల్ల జుట్టు నల్లగా మారిన నేచురల్ గా కనపడదు. అలాగే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. హేయిర్ డై లో ఉండే రసాయనాలు కారణంగా జుట్టు రాలిపోతుంది.

సహజసిద్ధంగా జుట్టు రంగును నల్లగా మార్చుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అలాగే జుట్టు రాలకుండా ఒత్తుగా ప్రకాశవంతంగా మారుతుంది. ఇప్పుడు తెల్లజుట్టు నల్లగా మారటానికి మంచి ఎఫెక్టివ్ చిట్కా గురించి తెలుసుకుందాం. ఈ చిట్కా కోసం ముందుగా డికాషన్ తయారుచేసుకోవాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి అరగ్లాస్ నీటిని పోసి ఒక స్పూన్ టీ పొడి వేయాలి.

ఆ తర్వాత 5 లవంగాలు, రెండు బిరియాని ఆకులను ముక్కలుగా కట్ చేసి వేసి 5 నిమిషాల పాటు మరిగించి ఆ నీటిని వడకట్టాలి. ఒక బౌల్ లో రెండు స్పూన్ల హెన్నా పొడి వేసి దానిలో తయారుచేసుకున్న డికాషన్ వేసి బాగా కలపాలి. ఈ పేస్ట్ ని జుట్టుకి పట్టించి గంట అయ్యాక తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి.

ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే తెల్లజుట్టు క్రమంగా నల్లగా మారుతుంది. అలాగే జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.