Beauty TipsHealth

Face Glow Tips:ఇలా చేస్తే ఎంతటి నల్లని మచ్చలు అయినా తొలగిపోయి ముఖం కాంతివంతంగా మారుతుంది

Tulasi and turmeric Face Glow Tips : మనలో చాలా మంది ముఖం అందంగా,కాంతివంతంగా ఉండటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే దాని కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరిగి వేల కొద్దీ డబ్బును ఖర్చు చేస్తూ ఉంటారు. అయినా అది తాత్కాలికమే. ఆలా కాకుండా మన ఇంటిలో దొరికే వస్తువులతో ఇప్పుడు చెప్పే చిట్కా పాటిస్తే ముఖం అందంగా మెరుస్తుంది.

అంతే కాకుండా ఖర్చు కూడా చాలా తక్కువగా అవుతుంది. ముఖం మీద నల్లని మచ్చలు వచ్చాయంటే ఒక పట్టాన తగ్గవు. ఎన్ని క్రీమ్స్ రాసిన తొందరగా తగ్గవు. ఇప్పుడు చెప్పే ఇంటి చిట్కాను ఫాలో అయితే నల్లని మచ్చలు,ఫైగ్మెంటేషన్ అన్ని తొలగిపోయి ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.

పది తులసి ఆకులను మెత్తని పేస్ట్ గా చేసి దానిలో అరస్పూన్ పసుపు, ఒక కర్పూరం బిళ్ళను పొడిగా చేసి వేయాలి. ఆ తర్వాత ఒక స్పూన్ రోజ్ వాటర్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి పది నిమిషాలు అయ్యాక ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే మంచి ఫలితం వస్తుంది.

తులసిలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండుట వలన చర్మంలో మృత కణాలను తొలగించి కొత్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. ముఖం మీద నల్లని మచ్చలను తొలగించటానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. పసుపులో ఉండే యాంటీ ఏజింగ్ లక్షణాలు చర్మం మీద ముడతలు లేకుండా చేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.