Healthhealth tips in telugu

ఈ టీ తాగితే తలనొప్పి,ఒత్తిడి,ఆందోళన, డిప్రెషన్ క్ష‌ణాల్లో తగ్గి ప్రశాంతంగా ఉంటారు

stress herbal tea In Telugu : ఒత్తిడి అనేది మన శరీరం మొత్తం మీద ప్రభావాన్ని చూపుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఒత్తిడి ప్రభావం కారణంగా ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. అంతేకాక ఒత్తిడి కారణంగా కోపం, బాధ లాంటి నెగటివ్ ఎమోషన్స్ పెరిగి యాంగ్జయిటీ, డిప్రెషన్‌లకు దారితీస్తాయి. శారీరకంగా కూడా ఒత్తిడి ప్రభావం ఉంటుంది.

ఒత్తిడి తగ్గించుకోవటానికి ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి. మన ఇంటిలో ఉండే సహజసిద్దమైన పదార్ధాలతో టీ తయారుచేసుకొని తాగితే ఒత్తిడి నుండి చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది. ఈ మధ్య కాలంలో మనలో చాలా మంది వయస్సుతో సంబందం లేకుండా ఒత్తిడికి గురి అవుతున్నారు.

ఈ సమస్య చిన్నగా అనిపించినా సరే దాని ప్రభావం చాలా ఎక్కువగానే ఉంటుంది. ఒక గ్లాసు వేడి నీటిలో ఒక గ్రీన్ టీ బ్యాగ్ వేసి పక్కన పెట్టుకోవాలి. రెండు ఉసిరికాయలను తీసుకుని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఇప్పుడు బ్లెండర్ తీసుకుని దానిలో కట్ చేసి పెట్టిన ఉసిరికాయ ముక్కలు., రెండు రెబ్బల కరివేపాకు, పావు స్పూన్ జీలకర్ర, చిటికెడు పింక్ సాల్ట్, ఒక కప్పు నీటిని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. .
curry leaves
ఈ విధంగా గ్రైండ్ చేసిన మిశ్రమం నుండి జ్యూస్ ను సపరేట్ చేయాలి. ఈ జ్యూస్ లో ముందుగా తయారుచేసి పెట్టుకున్న గ్రీన్ టీ ని మిక్స్ చేయాలి. ఆ తర్వాత ఒక స్పూను నిమ్మరసం., ఒక స్పూను పుదీనా జ్యూస్, ఒక స్పూను తేనె వేసి బాగా కలిపి తాగాలి.అవసరం అనుకుంటే చల్లదనం కోసం మూడు లేదా నాలుగు ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు.
jeelakarra Health Benefits in telugu
ఈ టీ ని తాగితే ఒత్తిడి., తలనొప్పి క్షణాల్లో తగ్గిపోతుంది. అలాగే శరీరం మరియు మైండ్ ఫ్రెష్ గా మారతాయి. ఈ టీ తీసుకోవడం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక వ్యవస్థ బలోపేతం అయి సీజనల్ గా వచ్చే వ్యాధులు రాకుండా కాపాడుతుంది. ఈ డ్రింక్ తాగితే తలనొప్పి తగ్గడమే కాకుండా మానసిక ఒత్తిడి కూడా తగ్గి చాలా ప్రశాంతంగా ఉంటారు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.