MoviesTollywood news in telugu

ఒకప్పుడు చిరంజీవితో ఆడి పాడిన ఈ హీరోయిన్ ఎన్ని కోట్లకు అధిపతో తెలిస్తే షాక్ అవుతారు

హైదరాబాద్ లో పుట్టి పెరిగిన మాధవి తల్లితండ్రులు శశిరేఖ, గోవిందరాజు. చిన్నతనం నుండి భరతనాట్యం నేర్చుకున్న మాధవి దాదాపుగా 1000 కి పైగా ప్రదర్శనలను ఇచ్చారు. మాధవి సినీ రంగానికి రావాలని ఎప్పుడు అనుకోలేదు. ఆమె సినీ రంగ ప్రవేశం కూడా చాలా విచిత్రంగా జరిగింది. ఆమె అబిడ్స్ లోని స్టామిని స్కూల్ లో ఎనిమిదొవ తరగతి చదువుతున్న సమయంలో దర్శక రత్న దాసరి నారాయణరావు కాంతిలో పడటంతో ఆమె స్టార్ హీరోయిన్ అయింది. ఆ సమయంలో దాసరి స్టార్ దర్శకుడిగా మంచి హైప్ లో ఉన్నారు. మాధవి దాసరి నారాయణరావు దర్శకత్వంలో తూర్పు పడమర సినిమా ద్వారా సినీ పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఆ సినిమా మంచి హిట్ అవటంతో ఆమెకు ఇక వెనుతిరిగి చూసుకోవలసిన అవసరం లేకపోయింది. వరుస ఆఫర్స్ తో బిజీగా మారిపోయింది. ఆమె తాన 17 సంవత్సరాల కెరీర్ లో తెలుగు, కన్నడ, తమిళ, మళయాళ, హిందీ, ఒరియా భాషల్లో దాదాపుగా 300 సినిమాల్లో నటించింది మాధవి 80, 90 దశకాల్లో గ్లామర్ హీరోయిన్ కి చిరునామాగా మారిందని చెప్పటంలో అతిశయోక్తి లేదు. అంతలా ఆమె బిజీ హీరోయిన్ గా ఉండేది 
చిరంజీవి,మాధవి ఫెయిర్ మంచి హిట్ ఫెయిర్ గా పేరు తెచ్చుకుంది. వారిద్దరూ కలిసి నటించిన చట్టానికి కళ్లులేవు, కోతల రాయుడు, దొంగ మొగుడు, ఇంట్లోరామయ్య వీదిలో కృష్ణయ్య..వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము రేపాయి. మాధవి వ్యక్తిగత జీవితం కూడా మంచు అనూహ్యమైన మలుపు తిరిగింది. మాధవి ఆధ్యాత్మిక గురువు రామస్వామి శిష్యురాలు కావటంతో అయన సలహాతో అయన శిష్యుడైన జర్మన్ మూలాలున్న భారతీయుడు అయినా రాజ్ శర్మను వివాహం చేసుకొని అమెరికాలో సెటిల్ అయ్యిపోయింది.రాజ్ శర్మకు పెద్ద ఫార్మా స్యూటికల్ కంపెనీ ఉంది. మాధవి కూడా బిజినెస్ లో భర్తకు సాయం చేస్తూ పూర్తిగా సినిమాలకు దూరం అయ్యిపోయారు. ఇప్పుడు అంధవి ఆస్థి పదివేల కోట్లకు పైనే ఉంటుందని సమాచారం. మాధవి మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన తన జీవితాన్ని బాగా ప్లాన్ చేసుకోవటంలో బాగా సక్సెస్ అయిందనే చెప్పాలి.