డయాబెటిస్ ఉన్నవారు పండ్లను తినవచ్చా…ఏ సమయంలో తింటే మంచిదో…?
Fruits For Diabetes : డయాబెటిస్ ఉన్న వారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఆహారం అనేది కీలకమైన పాత్రను పోషిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలకు హాని కలిగించని ఆహారాలను ఎంచుకోవాలి. తక్కువ GI (గ్లైసెమిక్ ఇండెక్స్) ఉన్న ఆహారాలను తీసుకోవాలి. డయాబెటిస్ ఉన్నవారు పండ్లను తినకూడదని అందరూ అనుకుంటారు.
ఎందుకంటే పండ్లలో పోషకాలు, పీచుపదార్థాలు ఎక్కువగా ఉండటం వలన రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుని పండ్లను తీసుకోవచ్చు. డయాబెటిస్ ఉన్నవారు యాపిల్స్, అవకాడోస్, బ్లాక్‌బెర్రీస్, చెర్రీస్, ద్రాక్షపండు, పీచెస్, బేరి, రేగు లేదా స్ట్రాబెర్రీ వంటి పండ్లను తీసుకోవచ్చు. వీటిలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉంటాయి.
డయాబెటిస్ ఉన్నవారు పండ్లను మధ్యాహ్నం 1-4 గంటల మధ్య తీసుకుంటే మంచిదని పోషకాహార నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఆ సమయంలో జీర్ణశక్తి అధికంగా ఉంటుంది. అలాగే వ్యాయామం చేసిన తర్వాత లేదా ముందు కూడా ఒక పండు తినవచ్చు. ఆ సమయంలో మన శరీరం అదనపు కార్బోహైడ్రేట్‌లను త్వరగా ఉపయోగించుకుంటుంది.
పండ్లలో ఫైబర్, విటమిన్లు సమృద్దిగా ఉంటాయి. ఇవి డయాబెటిస్ ఉన్నవారికి చాలా అవసరం. చక్కెర శోషణను మందగించడంలో, వాటి స్థాయిలను నియంత్రించడంలో ఫైబర్ కీలకమైన పాత్రను పోషిస్తుంది. అందువల్ల విటమిన్, ఫైబర్ కోల్పోకుండా ఉండటానికి జ్యూస్‌కు బదులుగా మొత్తం పండ్లను తినటం మంచిది. కొంత మంది జ్యూస్ లు తాగుతూ ఉంటారు. అలాంటి వారు కూడా పండ్లను తినటం అలవాటు చేసుకోవాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.