డయాబెటిస్ ఉన్నవారు Corn Flakes తింటే ఏమి అవుతుందో తెలుసా?
Corn Flakes : డయాబెటిస్ ఉన్నవారు తీసుకొనే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే డయాబెటిస్ నిర్వహణలో ఆహారం అనేది కీలకమైన పాత్రను పోషిస్తుంది. బిజీ జీవనశైలిలో చాలా మంది బ్రేక్‌ఫాస్ట్‌లలో కార్న్ ఫ్లేక్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. డయబెటిస్ ఉన్నవారు అలా తీసుకుంటే మంచిదేనా అనే విషయానికి వస్తే…
కార్న్ ఫ్లేక్స్ అధిక గ్లైజమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. కార్న్ ఫ్లేక్స్ లో మొక్కజొన్న,చక్కెర, మాల్ట్ ఫ్లేవర్, అధిక ఫ్రక్టోజ్ ఉంటాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. అలాగే దీనిలో ప్రోటీన్ తక్కువగా ఉండుట వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండదు. ప్రొసెస్ చేసిన చక్కెర కారణంగా శరీరంలో కొవ్వు పెరిగే అవకాశం ఉంది.
డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది. అధిక బరువు,గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కార్న్ ఫ్లేక్స్ అప్పుడప్పుడు తీసుకోవచ్చు. ప్రతి రోజు తీసుకుంటే మంచిది కాదు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో కార్న్ ఫ్లేక్స్ కి బదులుగా గోధుమ రవ్వ ఉప్మా, ఓట్స్ వంటి వాటిని ఎంపిక చేసుకోవాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.