MoviesTollywood news in telugu

ఇంత మంది బడా డైరెక్టర్లకి లైఫ్ ఇచ్చిన ఒకే ఒక్క హీరో ఎన్టీఆర్

Tollywood Hero Ntr Hit directers :నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. విభిన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ ఇమేజ్ బిల్డప్ చేసుకున్నాడు. నిజానికి బడా హీరోలు,బడా నిర్మాతలు,బడా దర్శకులు కల్సి తీసిన సినిమాలు డిజాస్టర్ అయిన సందర్భాలెన్నో ఉన్నాయి. ఇక ఎన్నో ప్లాప్ లతో సతమతమవుతున్న నిర్మాతలకు,దర్శకులకు తారక్ హిట్స్ అందించి లైఫ్ ఇచ్చాడు. బాడ్ లక్ నుంచి స్టార్ ఇమేజ్ వైపు డైరెక్టర్స్ ని మలిచిన హీరో జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పాలి. ప్లాప్ డైరెక్టర్స్ తో వరుస విజయాలు అందించాడు. ఆవిధంగా కొందరి పాలిట లక్కీ హీరో అయ్యాడు.

ప్లాప్ డైరెక్టర్స్ తో చేయాలంటే గట్స్ ఉండాలి. అదీ ఎన్టీఆర్ స్టైల్ అని ఫాన్స్ అంటున్నారు. ఇలాంటి వాళ్ళను చూస్తే,వరుస ప్లాప్ లతో సతమతమవుతూన్న పూరి జగన్నాధ్ ని టెంపర్ తో బంపర్ హిట్ వైపు మళ్లించిన ఘనత తారక్ కే దక్కుతుంది.

ఇక వన్ నేనొక్కడినే ప్లాప్ తర్వాత డైరెక్టర్ సుకుమార్ తో నాన్నకు ప్రేమతో మూవీ చేసి, బ్లాక్ బస్టర్ కొట్టించిన సత్తా జూనియర్ ఎన్టీఆర్ కే చెల్లింది. అనుకున్నది అనుకున్నట్టు,చెప్పాల్సింది చెప్పడంతో సుకుమార్ చూపిన శ్రద్ధకు తారక్ లుక్ అదిరింది. అందుకే విజయాన్ని నమోదు చేసుకుంది.

ఇక అదే కోవలో వరుస ప్లాప్ లతో నెట్టుకొస్తున్న డైరెక్టర్ బాబీకి జై లవకుశతో తారక్ హిట్ ఇచ్చాడు. ఏకంగా మూడు పాత్రలతో సాగిన ఈ సినిమాలో ఎన్టీఆర్ అదరగొట్టేసాడు. డైరెక్టర్ బాబీ ప్రతిభకు గీటురాయిగా ఈమూవీ వెళ్లి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అయ్యాడు. ఇది జూనియర్ ఎన్టీఆర్ ఘనదే.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వరుస హిట్స్ తో ముందుకు దూసుకుపోతున్న తరుణంలో పవన్ కళ్యాణ్ తో తీసిన అజ్ఞాతవాసి తీరని వేదన మిగిల్చింది. ఎందుకంటే పవన్ యాక్షన్ బానే ఉందిగానీ త్రివిక్రమ్ కథ బాగోలేదని స్థాయిలో పవన్ ఫాన్స్ అనేయడం తో త్రివిక్రమ్ కి ఏర్పడ్డ కళంకాన్ని జూనియర్ ఎన్టీఆర్ తుడిచేసాడు.
Ntr Watch price
ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ తీసిన అరవింద సమేత వీర రాఘవ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. ఆవిధంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ సక్సెస్ బాట పట్టించాడు తారక్.