MoviesTollywood news in telugu

టాలీవుడ్ లో సక్సెస్ అయిన తండ్రి కొడుకులు… ఒక లుక్ వేయండి

Father-Son Heroes in Tolly wood : తెలుగు సినీ పరిశ్రమలో తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని ఎంట్రీ ఇచ్చి చాలా మంది హీరోలు సక్సెస్ అయ్యారు. చాలా తక్కువ సమయంలోనే తామేమిటో నిరూపించుకొని ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు వారి గురించి వివరంగా తెలుసుకుందాం. 

కృష్ణం రాజు – ప్రభాస్
ప్రభాస్ కృష్ణం రాజు వారసుడిగా 2001లో ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత 2004లో త్రిష సరసన నటించిన వర్షం సినిమా ప్రభాస్ కు మంచి హిట్ ఇవ్వటమే కాక కెరీర్ కే మంచి బ్రేక్ ని ఇచ్చి ఇక వెనుదిరిగి చూసుకోవలసిన అవసరం లేకపోయింది. బాహుబలి సినిమాతో ఎంతటి క్రేజ్ సంపాదించుకున్నాడో మనకు తెలిసిందే. నాగేశ్వర రావు – నాగార్జున – నాగ చైతన్య – అఖిల్

నాగేశ్వరరావు వారసుడిగా నాగార్జున 1986 లో విక్రమ్ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత టాలీవుడ్ మన్మధుడు గా పేరుతెచ్చుకున్నారు. నాగార్జున వారసులుగా నాగ చైతన్య,అఖిల్ వచ్చి తమకంటూ సొంత ఇమేజ్ ని క్రియేట్ చేసుకోవటంలో సక్సెస్ అయ్యారు.
ఎన్టీఆర్ – బాలకృష్ణ
నందమూరి తారక రామారావు వారసుడిగా బాలకృష్ణ ఎంట్రీ ఇచ్చి తండ్రి బాటలో పౌరాణిక, జానపద, సాంఘీక సినిమాలలో నటించాడు. అభిమానులు బాలయ్య బాబు అని ముద్దుగా పిలుచుకునే బాలకృష్ణ వంద సినిమాలను పూర్తి చేసుకొని మాస్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. 
Chiru and Ram Charan
చిరంజీవి – రామ్ చరణ్
చిరంజీవి వారసుడిగా రామ్ చరణ్ చిరుత సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు. రామ్ చరణ్ రెండో సినిమా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మగధీర చేసాడు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కావటంతో మెగా వారసుడు ఇక వెనుదిరిగి చూసుకోవలసిన అవసరం లేకపోయింది. రామ్ చరణ్ హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా సినిమాలు చేస్తున్నాడు.
కృష్ణ – మహేష్ బాబు
కృష్ణ వారసుడిగా మహేష్ బాబు బాలనటుడిగా చాలా సినిమాలు చేసాడు. ‘రాకుమారుడు’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మహేష్ బాబు తనదైన శైలిలో ముందుకు దూసుకుపోతున్నాడు.
హరి కృష్ణ – ఎన్టీఆర్ 
హరి కృష్ణ కొడుకుగా నందమూరి తారక రామారావు మనమడిగా ఎన్టీఆర్ ‘నిన్ను చూడాలని’ సినిమాతో హీరోగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు. అభిమానులు ముద్దుగా యంగ్ టైగర్ అని పిలుచుకునే ఎన్టీఆర్ చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు.