MoviesTollywood news in telugu

5 కోట్లతో తీసిన గీతా గోవిందం కలెక్షన్స్ ఎన్ని కోట్లో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

vijay devarakonda geetha govindam : గీతా గోవిందం సినిమా విడుదల అయ్యి ఇన్ని సంవత్సరాలు అయినా సరే.. ఇప్పటికి చాలా ఆసక్తిగా చూడటానికి అభిమానులు సిద్దంగా ఉంటారు. విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన గీతా గోవిందం విడుదల అయినా మొదటి ఆట నుండే బాక్స్ ఆఫీస్ వద్ద కుమ్మేసింది. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత చేసిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ తనలో ఫన్నీ కోణం కూడా ఉందని నిరూపించుకున్నాడు.
geetha govindham movie
పరుశరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ సరసన రష్మిక మందాన నటించింది. అందరూ ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. చివరకి టాలీవుడ్ ప్రముఖులు కూడా ఈ సినిమాలో హాస్యానికి ఫిదా అవుతున్నారంటే సినిమా ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. విజయ్ దేవరకొండ ఫెర్ఫామెన్స్ కి మహేష్ బాబు,అల్లు అర్జున్,రామ్ చరణ్ లు సైతం విజయ్ ని మెచ్చుకున్నారు.
Tollywood hero vijay devarakonda
ఈ సినిమాకి నిర్మాతలు అయినా అల్లు అరవింద్,బన్నీ వాసు లాభాల బాట పట్టారు. ఆగష్టు 15న విడుదలైన గీత గోవిందం.. ఐదు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోనే రూ.33 కోట్ల గ్రాస్ రాబట్టిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. కర్ణాటకలోనూ విజయ్ సినిమా రూ.5 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఓవరాల్‌గా ఇండియాలో ఈ చిత్రం రూ.40 కోట్లకు పైగా రాబట్టింది.
https://www.chaipakodi.com/

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."