MoviesTollywood news in telugu

బాలయ్య పక్కనే ఉన్న ఈ బాబు ఎవరో తెలుసా ? ప్రస్తుతం స్టార్ హీరో..!

bala gopaludu movie child artists :సినిమా పరిశ్రమలో కొందరు కల్సి నటించినా మనం పెద్దగా గుర్తించలేం. గమ్మున స్ఫురణకు కూడా రాదు. స్టార్ హీరోల పిల్లలు చైల్డ్ ఆర్టిస్టులుగా నటించారు. నటిస్తున్నారు కూడా. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, బన్నీ, అఖిల్, తరుణ్, ఇలా చాలామంది చిన్నప్పుడు తెరమీద మెరిశారు. పెద్దయ్యాక హీరోలుగా దుమ్మురేపుతున్నారు.

అలాగే రాశి కూడా చిన్నప్పుడు సినిమాల్లో బాలనటిగా మెరిసింది. అలాగే కళ్యాణ్ రామ్ కూడా చేసాడు. ఇక వీరిద్దరూ కల్సి ఒకే సినిమాలో నటించారు. అందునా అన్నాచెల్లెళ్లుగా నటించారు. నందమూరి బాలయ్య ,సుహాసిని నటించిన బాలగోపాలుడు మూవీ కోడి రామకృష్ణ డైరెక్షన్ లో వచ్చింది. ఈ మూవీలో కళ్యాణ్ రామ్, రాశి నటించారు.

కళ్యాణ్ రామ్ పేరు రాజా. ఇక కళ్యాణ్ రామ్ మళ్ళీ ఏ సినిమాలో నటించలేదు. కళ్యాణ్ రామ్ తనకంటూ సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకొని ముందుకు సాగుతున్నాడు. గత ఏడాది బింబిసారా మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. ఆ తరువాత ఈ ఏడాది వచ్చిన అమిగోస్ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ డెవిల్ మూవీలో నటిస్తున్నారు.
Click Here To Follow Chaipakodi On Google News

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."