MoviesTollywood news in telugu

ఈ సినిమా చూసి 40 మంది సూసైడ్ చేసుకున్నారంటే నమ్మగలరా ?

Maro Charitra Telugu Movie:బలమైన ప్రసార మాధ్యమం సినిమా. అందుకే సినిమా హీరో హీరోయిన్స్ సొసైటీ మీద తీవ్ర ప్రభావం చూపిస్తారు. సినిమా విడుదలైతే బ్యానర్స్ కట్టడం ,స్వీట్స్ పంచడం వంటి హడావిడి మాత్రమే కాదు,హీరోలను కూడా ఫాన్స్ అనుసరిస్తారు. నాగార్జున నటించిన సెన్షనల్ హిట్ శివ మూవీ చూసాక యువతలో చాలామంది సైకిల్ చైన్స్ పట్టుకుని తిరిగారు.

పోకిరి సినిమా ఫాన్స్ బాడీ లాంగ్వేజ్ మార్చేసింది. ఇడియట్,తొలిప్రేమ,ఆర్య,అర్జున్ రెడ్డి వంటి మూవీస్ మైండ్ సెట్ ,బిహేవియర్ మార్చేశాయి. సినిమాలు చూసి పక్క హీరో ఫాన్స్ తో గొడవ పడడం, కొట్టుకోవడం వంటివి చూసాం,విన్నాం. కానీ ఒక సినిమా చూసాక సూసైడ్ చేసుకున్నారంటే నిజంగా ఆశ్చర్యమే.కె బాలచందర్ డైరెక్షన్ లో కమల్ హాసన్,సరిత జంటగా 1978లో వచ్చిన అద్భుత ప్రేమ కావ్యం మరో చరిత్ర సినిమా దేశం మొత్తాన్ని ఓ ఊపేసింది. యూత్ ఈ మూవీని ఎన్నిసార్లు చూసారో వాళ్ళకే తెలీదు. కొన్నిచోట్ల సంవత్సరాల తరబడి ఆడింది.

ఈ మూవీ క్లైమాక్స్ లో ప్రేమలో విఫలమయ్యామని,ఇక కలవడం కుదరదని హీరో హీరోయిన్స్ భావించి ఇద్దరూ ఆత్మహత్య చేసుకుంటారు. ఈసీన్ కంటతడి పెట్టిస్తుంది. అప్పట్లో ఈ మూవీ యూత్ కి బాగా కనెక్ట్ కావడంతో,తమ ప్రేమకి పెద్దలు ఒప్పుకోలేదనో,ఇక కలవడం కుదరదనో కొన్ని ప్రేమ జంటలు సూసైడ్ చేసుకున్నాయి. మరోచరిత్ర సినిమాను ప్రస్తావిస్తూ అప్పట్లో 20జంటలు సూసైడ్ లెటర్స్ రాసి మరీ ఆత్మహత్యకు దిగారు. దీంతో డైరెక్టర్ బాలచందర్ ని మానవ హక్కుల సంఘాలు,అభ్యుదయ సంఘాలు తిట్టడం మొదలెట్టాయి.

దాంతో సినిమా 200రోజుల ఫంక్షన్ లో బాలచందర్ వివరణ ఇస్తూ,ఈ సినిమా తీయడం జీవితంలో నేను చేసిన అతిపెద్ద పొరపాటు. దయచేసి నన్ను క్షమించండి. యూత్ ని ప్రభావితం చేసేలా ఇలాంటి సినిమాలు తీయను. ఈ సినిమా తీసి రోజూ బాధ పడుతున్నా’అని చెప్పుకొచ్చారు.