పైల్స్ సమస్య ఉన్నవారు ఇలా చేస్తే చాలు…శాశ్వతంగా మాయం అవుతాయి
piles Home Remedies In telugu : ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో చాలా మంది పైల్స్ సమస్యతో బాధపడుతున్నారు. మారిన ఆహారపు అలవాట్లు,నీరు తక్కువగా తాగటం,మలబద్దకం సమస్య,ఒత్తిడి వంటి కారణాలతో పైల్స్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. పైల్స్ సమస్య ఉన్నప్పుడు బాధ విపరీతంగా ఉంటుంది.

ఈ సమస్యను ఇంటి చిట్కాల ద్వారా తగ్గించుకోవచ్చు. డాక్టర్ సూచనలను పాటిస్తూ ఇప్పుడు చెప్పే చిట్కా ఫాలో అయితే చాలా తొందరగా పైల్స్ సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది. కాస్త ఓపిక,సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది. దీని కోసం చిన్న ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి.

ఒక బౌల్ లో ఈ ఉల్లి పేస్ట్ ని వేయాలి. ఆ తర్వాత ఒక స్పూన్ ఆముదం,అరస్పూన్ పసుపు వేసి బాగా కలపాలి. పైల్స్ ఉన్న ప్రదేశంలో గోరువెచ్చని నీళ్ళతో కడగాలి. తర్వాత ఈ పేస్ట్ ను అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని ఒక గంట లేదా రెండు గంటలు ఉంచుకోవాలి. ఆ తర్వాత నార్మల్ వాటర్ తో క్లీన్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఫైల్స్ త్వరగా మాడిపోయి రాలిపోతాయి.

ఉల్లిపాయ నొప్పి, మంట, ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది. ఆముదం ఫైల్స్ ని మాడిపోయి రాలిపోయేలా చేయడానికి బాగా సహాయపడుతుంది. పసుపు కూడా పైల్స్ తగ్గించటానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/

