యంగ్ ఎన్టీఆర్ కెరీర్‌లో రిలీజ్ అవ్వని సినిమా ఉందని మీకు తెలుసా ?
Ntr Movie:జూనియర్ ఎన్టీఆర్ తెలుగు ఇండస్ట్రీలో నందమూరి నట వారసుడిగా అడుగుపెట్టి తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ సెపరేట్ ఇమేజ్ ని సృష్టించుకున్నాడు. రూపంలో తాత పోలికలే కాదు. అభినయంలోను ఆయన వారసత్వం పుణికిపుచ్చుకున్నాడు జూనియర్. ఎన్టీఆర్ కెరీర్‌లో యాక్ట్ చేసిన ఓ సినిమా మాత్రం ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోలేదట.
పైగా నందమూరి కుటుంబంలో ముగ్గురు హీరోలు నటించిన ఈ సినిమా విడుదల కాకపోవడం యాదృచ్ఛికమనే చెప్పాలి.ఇది నిజం. తారక్ చిన్నపుడు రామాయణం సినిమాలో రాముడిగా తన ఫిల్మ్ కెరీర్ మొదలు పెట్టాడు. ఆ తర్వాత ‘నిన్ను చూడాలని’ సినిమాతో పూర్తి స్థాయి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఒకసారి క్యారెక్టర్ లోకి వెళ్లాడంటే, యాక్షన్‌లో పర్ఫెక్షన్, డైలాగ్స్‌లో ఎమోషన్, మూమెంట్స్‌లో ఒక రకమైన రిథమ్ కంపల్సరీ గా ఉంటుంది.
తనకు నచ్చిన పాత్ర వస్తే ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి, ఆ పాత్ర తాలూకు అంతు చూడటంలో సీనియర్ ఎన్టీఆర్ తాతలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా మొండిఘటం అంటారు. అలాగే బాబాయ్ బాలకృష్ణలా యాక్షన్ సీన్స్‌లో తొడకట్టగలనని ఎప్పుడో చాటాడు. జూనియర్ ఎన్టీఆర్ నిజానికి సీనియర్ ఎన్టీఆర్ దర్శకత్వంలో తెరకెక్కిన హిందీ ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ మూవీలో భరతుడి క్యారెక్టర్ కోసం మొదటిసారి తారక్ మొఖానికి రంగేసు కున్నాడు.
తెలుగు వెర్షన్ బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలో బాలకృష్ణ.. హరిశ్చంద్రుడు, దుశ్శంతుడుగా వేసాడు.హిందీలో కూడా అదే వేషం వేసాడు. ఈ చిత్రంలో దుశ్యంతుడు కొడుకైన భరతుడిగా చిన్న ఎన్టీఆర్ యాక్ట్ చేసాడు. మేజర్ చంద్రకాంత్ సినిమా సమయంలో తారక్ హిందీ అనర్గళంగా మాట్లాడం చూసి పెద్ద ఎన్టీఆర్ హిందీ వెర్షన్ ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ సినిమాలో తారక్ ను తీసుకున్నారు.
కానీ తెలుగులో ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో హిందీ వెర్షన్‌కు సంబంధించిన ఈ సినిమా షూటింగ్ కంప్లీటైన హిందీ ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ చిత్రాన్ని అన్నగారు హోల్ట్‌లో పెట్టారు. ఆ తర్వాత పెద్ద ఎన్టీఆర్ రాజకీయాలతో బిజీ కావడం వంటి కొన్ని కారణాలతో ఈ సినిమా అలానే ఉండిపోయింది. ఆ రకంగా జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌లోనే కాకుండా పెద్ద ఎన్టీఆర్, బాలకృష్ణ నటించిన ఈ సినిమా ఇప్పటికీ విడుదల కాలేదు.

