Healthhealth tips in telugu

ఈ ఒక్క లడ్డుతో రక్తహీనత తగ్గి పిల్లల్లో తెలివితేటలు పెరిగి పెద్దల్లో మోకాళ్ళనొప్పులు మాయం

iron deficiency Home Remedies In telugu : శరీరంలో ఐరన్ లోపం వచ్చినప్పుడు రక్తహీనత సమస్యకు కారణం అవుతుంది. ఈ మధ్యకాలంలో ఎక్కువగా రక్తహీనత సమస్య కనబడుతోంది రక్తహీనత కారణంగా ఎన్నో రకాల సమస్యలు ఏర్పడతాయి. రక్తహీనత సమస్య ఉన్నప్పుడు మనం ఇంటి చిట్కాల ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు..

దీనికోసం వాల్ నట్స్ తీసుకోవాలి వాల్ నట్స్ లో ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. నువ్వులలో తెల్ల నువ్వులను తీసుకోవాలి.తెల్ల నువ్వులలో కూడా ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. ఇక ఆ తర్వాత బెల్లం కూడా తీసుకోవాలి.బెల్లంలో కూడా ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. ఒక అరకప్పు వాల్నట్స్ అరకప్పు నువ్వులు తీసుకొని మెత్తని పొడిగా చేసుకోవాలి.

ఈ పొడిలో అర కప్పు బెల్లం తురుము వేసి మూడు కలిపి కొంచెం ఆవు నెయ్యి వేసి ఉండలుగా చుట్టుకొని ప్రతిరోజు ఒకటి తింటూ ఉండాలి ఈ విధంగా ప్రతి రోజు ఒక లడ్డూ తింటూ ఉంటే తగ్గి రక్తహీనత సమస్య తొలగిపోతుంది. కాస్త ఓపికగా చేసుకుంటే మన ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడుతాయి.

ఈ లడ్డు రక్తహీనత సమస్యలు తగ్గించడమే కాకుండా శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది పిల్లలలో ఎదుగుదల బాగుంటుంది. అలాగే కీళ్లనొప్పులు,మోకాళ్ళ నొప్పులు,అలసట,నీరసం,నిసత్తువ వంటివి అన్నీ తొలగిపోయి చురుకుగా,ఉషారుగా ఉంటారు. ఈ లడ్డులను ఒకసారి చేసుకొని 10 రోజుల పాటు తినవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/