MoviesTollywood news in telugu

బ్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆ రోజేనా…ఎక్కడ జరుగుతుందో…?

Bro Pre Release Event:ప‌వ‌న్ క‌ళ్యాణ్(Pawan Kalyan), సాయిధ‌ర‌మ్‌తేజ్(Sai Dharam Tej) కాంబినేషన్ లో మొదటిసారిగా వస్తున్న BRO సినిమా జూలై 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుంది. ఫాంట‌సీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకి స‌ముద్ర‌ఖ‌ని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు.

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ తో పాటు వేదిక ఖ‌రారైన‌ట్లు స‌మాచారం. జూలై 25న హైద‌రాబాద్‌లోని శిల్పాక‌ళావేదిక‌లో బ్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వ‌హించేందుకు సినిమా యూనిట్ స‌న్నాహాలు చేస్తోన్న‌ట్లు తెలిసింది. ఈ వేడుక‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ చీఫ్ గెస్ట్‌గా హాజ‌రుకానున్నాడు.

అర్ధాంత‌రంగా క‌న్నుమూసిన ఓ వ్య‌క్తికి దేవుడు సెకండ్ ఛాన్స్ ఇస్తే ఏం జ‌రిగింద‌నే కథతో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో టైమ్ అనే పాత్ర‌లో ప‌వ‌న్ కళ్యాణ్, మార్కాండేయులు అలియాస్ మార్క్ అనే క్యారెక్ట‌ర్‌లో సాయిధ‌ర‌మ్‌తేజ్ క‌నిపించ‌బోతున్నాడు. ఈ సినిమాకి అగ్ర ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ స్క్రీన్‌ప్లేతో పాటు సంభాష‌ణ‌ల‌ను అందిస్తోన్నారు. దాంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."