Devotional

శ్రావణ మాసంలో మీ రాశిని బట్టి ఇలా చేస్తే ఏడు జన్మల పాపాలు తొలగి అష్టఐశ్వర్యాలు మీ సొంతం

Lucky Zodiac Sign:శ్రావణమాసం అనేది దక్షిణాయనంలో వచ్చే విశిష్టమైన మాసం. శ్రావణ మాసము తెలుగు సంవత్సరంలో ఐదవ నెల. పౌర్ణమి రోజున శ్రవణ నక్షత్రము (అనగా చంద్రుడు శ్రవణం నక్షత్రంతో కలిసిన రోజు) కావున ఆ నెల శ్రావణము. ప్రస్తుతం వాడుకలో ఉన్న గ్రెగొరీయన్ క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసం జూలై, ఆగష్టు నెలల్లో వచ్చును.

ఈ మాసంలో లక్ష్మి దేవికి ఎంత ప్రాముఖ్యత ఉందో అంతే ప్రాముఖ్యత పరమ శివునికి కూడా ఉంది. శ్రావణమాసంలో చేసే పూజలకు వెయ్యి రేట్లు ఫలితం కనపడుతుంది. శ్రావణమాసంలో సోమవారం శివునికి అభిషేకాలు, ఉపవాసం వంటివి చేస్తే ఏడు జన్మల పాపాలు తొలగి అష్టఐశ్వర్యాలు మీ సొంతం. పాల సముద్ర మధనం శ్రావణ మాసంలో జరిగింది. అప్పుడు శివుడు గరళాన్ని స్వీకరించి నీల కంఠుడు గా మారినట్టు పురాణాల్లో చెప్పారు. శివునికి అత్యంత ఇష్టమైన మాసాల్లో శ్రావణమాసం ఒకటి.

మేష రాశివారు శివునికి ఉమ్మెత్తపూలతో పూజించి, ఆవుపాలు,పెరుగుతో అభిషేకం చేయాలి.

వృషభ రాశి వారు మల్లె పూలతో పూజించి చెరకు రసంతో అభిషేకం

మిధున రాశివారు చందనంతో పూజ చేయాలి. స్పటిక లింగానికి చేస్తే చాలా మంచిది. తేనేతో అభిషేకం

కర్కాటక రాశివారు చందనంతో అభిషేకం చేసి గోధుమ పిండితో తయారుచేసిన వంటకాలను నైవేద్యం

సింహ రాశివారు జిల్లేడు పూలతో పూజ చేసి పండ్ల రసాలతో అభిషేకం చేస్తే

కన్యా రాశివారు నీటిలో కర్పూరాన్ని కలిపి ఆ నీటితో అభిషేకం చేసి మారేడు దళాలతో పూజ చేస్తే

తులారాశివారు మల్లెపూలు,బిల్వ పత్రాలతో పూజ చేసి చందనం కలిపినా నీటితో అభిషేకం చేస్తే

వృశ్చిక  రాశివారు ఆవునెయ్యి లేదా తేనెతో అభిషేకం చేసి గనెన్ఱు పూలతో అభిషేకం

ధనస్సు రాశివారు డ్రై ఫ్రూట్స్ నైవేద్యంగా పెట్టి గులాబీలు,బిల్వ పత్రాలు నీటిలో కలిపి ఆ నీటిలో అభిషేకం చేస్తే

మకర రాశివారు నీటితో అభిషేకం చేసి తెల్ల జిల్లేడు పూలతో పూజించి

కుంభ రాశివారు నువ్వులతో అభిషేకం చేసి తెల్లని పూలతో పూజ

మీనా రాశివారు రావిచెట్టు కింద ఉన్న శివలింగానికి బిల్వ పత్రాలతో పూజ