MoviesTollywood news in telugu

ఈ హీరోలు సినిమాల్లోకి రాకముందు ఏ జాబ్ చేసేవారో తెలుసా…?

Tollywood And Bollywood Heroes:చాలామంది పుడుతోనే ధనవంతులుగా ఉండరు. స్వశక్తితో ఎదిగి ఉన్నత స్థాయికి చేరతారు. ఇక సెలబ్రిటీలుగా ఉండే సినిమా వాళ్ళు కూడా తాము ఎదగడానికి ఎంతగానో శ్రమిస్తారు. ఎన్నో నిద్రలేని రాత్రులు గడపడమే కాదు, తినడానికి తిండిలేక ఖాళీకడుపుతో పడుకున్న రోజులు ఎన్నో ఉంటాయి. పద్మ విభూషణ్, పద్మ భూషణ్ అవార్డులు సొంతం చేసుకున్న బిగ్ బి అమితాబ్ బచ్చన్ ని తీసుకుంటే,అమితాబ్ ని జాకీగా చేర్చుకోడానికి రెండు రేడియో స్టేషన్స్ తిరస్కరించాయి. ఇక సినిమాల్లోకి వచ్చాక12మూవీస్ ప్లాప్ అయ్యాయి. అయినా అంకితభావాన్ని కోల్పోకుండా పనిచేసారు.

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ దేశంలోనే కాదు, జపాన్,సింగపూర్ లలో కూడా ఫాన్స్ ఉన్నారు. ఒకప్పుడు కార్పెంటర్. కూలీ నుంచి బస్ కండక్టర్ గా ఉద్యోగం చేస్తూ .. అక్కడ నుంచి సినిమాల్లోకి వచ్చి అంచెలంచెలుగా ఎదిగి లెజండరీ అయ్యాడు. పద్మ విభూషణ్, పద్మ భూషణ్ లాంటి ఎన్నో అవార్డులు పొందాడు. పద్మ విభూషణ్, పద్మ భూషణ్ లాంటి ఎన్నో అవార్డులు పొందిన దిలీప్ కుమార్ ఒకప్పుడు రోడ్డుపక్కన పళ్ళు అమ్ముకున్నాడని ఎవరికీ తెలియదు. ఆర్మీ క్లబ్ లో స్టాల్ పెట్టుకుని బతికారు.

సినిమాల్లోకి వచ్చిన తొలిరోజుల్లో ఇంటికి,స్టూడియోకి వెళ్ళడానికి ఒక్క పైసా కూడా ఉండేది కాదట. ఎవర్ గ్రీన్ దేవానంద్ ఖాతాలో హరే రామ హరే కృష్ణ లాంటి ఎన్నో క్లాసిక్ మూవీస్ ఉన్నాయి. గుమస్తాగా పనిచేసి,మినిస్ట్రీలో ఉద్యోగం చేసి,సినిమాల వైపు వచ్చి ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నతస్థాయికి ఎదిగారు. హీమాన్ ఆఫ్ ది ఇండియా, యాక్షన్ కింగ్ గా పేరొందిన ధర్మేంద్ర ప్లంబర్ గా పనిచేసేవాడు. పనిలేక ఖాళీగా పడుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి. పట్టుదలతో సినిమాల్లో ఎదిగి పద్మభూషణ్ లాంటి ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నాడు.

నక్సలైట్ సినిమాల్లోకి వచ్చి దేశ విదేశాల్లో అభిమానులను సొంతం చేసుకున్న మిదున్ చక్రవర్తి డిస్కో డాన్సర్ మూవీతో భారీ హిట్ అందుకుని స్టార్ గా ఎదిగాడు. బాలీవుడ్ కిలాడి అక్షయ్ కుమార్ ఒకప్పుడు వెయిటర్,సేల్స్ మ్యాన్ గా చేసేవాడు. ఇక సినిమాల్లో పనికిరావని తిరస్కరించారు. అయితే పట్టుదలతో పనిచేసి, ఎదిగాడు. పద్మశ్రీ లాంటి ఎన్నో పురస్కారాలు అందుకున్నాడు. కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ ఒకప్పుడు ఒక సామాన్యుడు. ఢిల్లీలో ఓ రెస్టారెంట్ పెట్టాడు.

తర్వాత ఆర్కెస్ట్రా ట్రూప్ లో చేరి ఆతర్వాత ఛాన్స్ ల కోసం ముంబయి వచ్చి,హోటల్ లో ఉండడానికి డబ్బుల్లేక హోటల్ బయట నిద్రపోయేవాడు. మొత్తానికి సినిమాలో ఛాన్స్ వచ్చింది. అంచెలఅంచెలుగా ఎదిగాడు. 40ఏళ్ళ ఇండస్ట్రీ లో తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్న భ్రమరీ రాణి మొదట్లో వెయిటర్ గా పనిచేసేవాడు. ఫోటోగ్రఫీలో ,బేకరీలో చేసాడు. సినిమాల్లోకి వచ్చి వెనక్కి తిరిగి చూడలేదు. నవాజుద్దీన్ సిద్ధికి ని చూస్తే యితడు నటుడేంటి అనిపిస్తుంది. కానీ తన నటనతో ఎంతోమంది ఫాన్స్ ని సొంతం చేసుకున్నాడు. వాచ్ మాన్ గా చేసి, జూనియర్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించాడు.

టాలీవుడ్ విషయానికి వస్తే విజయ్ దేవరకొండ సినిమాల్లోకి రాకముందు ట్యూషన్ మాస్టర్ గా పనిచేసేవారు. అల్లు అర్జున్ సినిమాల్లోకి రాకముందు యామినేటర్ గా పనిచేసేవాడు. హాస్యనటుడు బ్రహ్మానందం సినిమాల్లోకి రాకముందు తెలుగు లెక్చరర్ గా పనిచేసేవాడు. మోహన్ బాబు సినిమాల్లోకి రాకముందు వ్యాయామ ఉపాధ్యాయుడుగా పనిచేసాడు. గోపీచంద్ సినిమాల్లోకి రాకముందు ఓ ప్రముఖ టీవీ ఛానల్లో న్యూస్ రీడర్ గా పని చేసేవాడు.