BusinessEDUCATION

Youtube:యూట్యూబ్ వీడియోలు చేస్తున్నారా…డబ్బులు ఎలా వస్తాయి…లక్ష సబ్‌స్క్రైబర్లు ఉంటే ఎంత వస్తాయి..?

Youtube:కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత చాలా మంది YOUTUBE చానల్ వైపు అడుగులు వేసారు. YOUTUBE చానల్ రన్ చేయటానికి ఏ విధమైన విద్యార్హత ఉండవలసిన అవసరం లేదు. కేవలం సృజనాత్మకత, కొద్దిగా ప్రతిభ ఉంటె చాలు. అలాగే కష్టపడే తత్త్వం, ఓపిక కూడా ఉండాలి. ఒక చానల్ కి సబ్‌స్క్రైబర్స్ పెరగాలన్నా viewers పెరగాలన్నా పెట్టె కంటెంట్ బాగుండాలి.

కంటెంట్‌లో కొత్తదనం, వైవిధ్యం ఉంటేనే వీడియోలకు మంచి ఆదరణ లభిస్తుంది. ఒక్కో ఛానెల్ పోస్ట్ చేసేటువంటి కంటెంట్‌కు వచ్చిన వ్యూస్, ఆ ఛానెల్ సబ్‌స్క్రైబర్స్ సంఖ్యపై కూడా ఆధారపడి ఉంటుంది. అలా యూట్యూబర్ నెలకు లక్షల్లో సంపాదిస్తుంటారు. అయితే ఎంత మంది సబ్‌స్క్రైబర్స్ ఉన్నా వ్యూస్ లేకపోతే కష్టం. వ్యూస్ వచ్చేలా కంటెంట్ చేస్తే దాదాపుగా నెలకు లక్ష రూపాయిల వరకు సంపాదించవచ్చు.

ఏదైనా చానల్ లో పెట్టె కంటెంట్ మీద ఆదాయం అనేది ఆదారపడి ఉంటుంది. చానల్ లో పెట్టె కంటెంట్ చాలా ఆకర్షణగా ఉండాలి. అప్పుడే వీడియో చూసే వారి సంఖ్య పెరిగి డబ్బులు ఎక్కువగా వస్తాయి. మనం పెట్టె వీడియోల్లో యాడ్స్ వస్తాయి. ఆ యాడ్స్ ద్వారా మనకు డబ్బులు వస్తాయి. అంతేకాకుండా ఏదైనా ప్రోడక్ట్ రివ్యూ చేసినప్పుడు కూడా డబ్బులు వస్తాయి.

అయితే చానల్ మానిటైజ్ చేసుకోవాలి. చానల్ మానిటైజ్ అయ్యాక యాడ్‌సెన్స్ అప్రూవ్ అవుతుంది. దీంతో యూట్యూబర్‌కు ఆ యాడ్ రెవెన్యూలో కొంత భాగం యూట్యూబ్ ఇస్తుంది. ఇక ఆ తర్వాత యాడ్స్, షాపింగ్, ఛానెల్ మెంబర్‌షిప్స్, యూట్యూబ్ ప్రీమియం, సూపర్ చాట్ అండ్ సూపర్ స్ట్రికర్స్, సూపర్ థ్యాంక్స్ వంటి ద్వారా కూడా అదనంగా ఆదాయం వస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Click Here To Follow Chaipakodi On Google News