MoviesTollywood news in telugu

Suman Shetty : ‘సుమన్ శెట్టి’ గుర్తు ఉన్నాడా…ఇప్పుడు ఏమి చేస్తున్నాడో తెలుసా…?

Suman Shetty :తేజ దర్శకత్వంలో నితిన్ ,సదా జంటగా వచ్చిన ‘జయం’సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సుమన్ శెట్టి కమెడియన్ గా ఓ వెలుగు వెలిగి మళ్ళీ చతికిలా బడిపోయాడు. ఛాన్స్ లు రాకపోవడంతో సొంతూరు వెళ్ళిపోయాడు. ఇక ఛాన్స్ లు రావన్న నిర్ణయానికి వచ్చేసాడు.

చూడగానే నవ్వు పుట్టించే కమెడియన్ లలో ఒకడిగా గుర్తింపు పొందిన యితడు జయంతో వెండితెర మీద మెరిసి అనతికాలంలోనే స్టార్ కమెడియన్ అయిపోయాడు. నల్గొండ జిల్లా మిర్యాలగుడాకు చెందిన సుమన్ శెట్టి తండ్రి కిరాణా దుకాణం నడిపేవాడు. తండ్రి ఎక్కడికైనా వెళ్తే దుకాణంలో కూర్చునేవాడు.

ఓ రోజు జయం సినిమా ఆడిషన్స్ ప్రకటన చూసి ఫోటోలు పంపాడు. ఆ ఫోటోలు చూసిన చిత్ర బృందం ఇక వెంటనే సుమన్ శెట్టిని ఒకే చేసేసింది. అలా జయం మూవీతో ఎంట్రీ ఇచ్చిన సుమన్ శెట్టి కి వరుస ఛాన్స్ లు వచ్చిపడ్డాయి. ఏడాదికి 7,8సినిమాల్లో నటిస్తూ యువ కమెడియన్స్ లో ఒకడిగా గుర్తింపు పొందాడు.

ఇక 2009లో నాగభవాని అనే అమ్మాయితో సుమన్ శెట్టికి విశాఖలో పెళ్లి అయింది. అప్పటికే లావుగా ఉండే యితడు పెళ్లాయ్యాక మరింత లావు అయిపోవడంతో ఎన్నో ఛాన్స్ లు మిస్సయ్యాడు. ఇక గబ్బర్ సింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా పిలిపించుకుని లావు తగ్గాలని, బరువు తగ్గితే ఛాన్స్ లు వస్తాయని, ఇప్పటినుంచి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయమని చెబుతూ ఆ సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు.

ఆ తర్వాత బిజినెస్ తో బిజీ అయిపోయాడు. ఇప్పుడు వచ్చే యంగ్ డైరెక్టర్స్ మళ్ళీ ఆయనకి అవకాశం ఇస్తే తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి సిద్దం గా ఉన్నాడు.చూడాలి మరి ఆయనకి ఎంతవరకు అవకాశాలు వస్తాయి అనేది.
Click Here To Follow Chaipakodi On Google News

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."