Upcoming OTT Release in August: ఈనెల ఓటీటీలోకి రానున్న తెలుగు సినిమాలు ఎన్ని ఉన్నాయో…?
Upcoming OTT Release in August: ఆగస్ట్ నెలలో OTT లో విడుదల కానున్న సినిమాలు ఏమిటో చూద్దాం. ఈ నెల చాలా సినిమాలు వస్తున్నాయి. అయితే కొన్ని సినిమాలకు స్ట్రీమింగ్ డేట్స్ వచ్చాయి. వాటి గురించి తెలుసుకుందాం.
ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఆగస్టు 10వ తేదీన సాయంత్రం 7 గంటలకు అశ్విన్ బాబు, నందిత శ్వేత నటించిన హిడింబ చిత్రం వస్తుంది.
‘ఈటీవీ విన్’ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఆగస్ట్ 15 న చైతన్య రావ్, లావణ్య ప్రధాన పాత్రల్లో నటించిన ‘అన్నపూర్ణ ఫొటో స్టూడియోస్’ సినిమా వస్తుంది .
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఆగస్టు 20 న విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన ‘హత్య’ సినిమా వస్తుంది.
అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఈ నెల మూడో వారంలో ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ సినిమా వస్తుందని వార్తలు వస్తున్నాయి.
ఆగస్టు నెలలో ఇప్పటికే రంగబలి (నెట్‍ఫ్లిక్స్), పరేషాన్ (సోనీ లివ్), భాగ్ సాలే (అమెజాన్ ప్రైమ్ వీజియో) సినిమాలు ఓటీటీల్లో స్ట్రీమింగ్‍కు వచ్చేసి అభిమానులను అలరిస్తున్నాయి. బేబి సినిమా ఈ నెల చివర్లో OTT కి వస్తుందని సమాచారం.

