MoviesTollywood news in telugu

Allari Alludu:నాగార్జున నటించిన ‘అల్లరి అల్లుడు’ మూవీ రహస్యాలు ఇవే..!

Allari Alludu telugu Movie :తమ అభిమాన హీరోల సినిమాలకు సంబంధించి ఏ విషయం తెలిసిన అభిమానులు పండగ చేసుకుంటారు. ఈ సినిమాలో వాణిశ్రీ నటన ఒక హైలెట్ అని చెప్పవచ్చు. మీనా కూడా చాలా క్యుట్ గా నటించింది. ఈ సినిమాలో నటించిన నటి నటులు అందరూ ఓ రేంజ్ లో నటించారు.

కింగ్ నాగార్జున నటించిన అల్లరి అల్లుడు మూవీ పక్కా మాస్ తరహాలో సాగుతూ అదరగొట్టేసి, టాప్ టెన్ కమర్షియల్ మూవీస్ లో ఒకటిగా నిల్చింది. శివ తర్వాత విభిన్న తరహా మూవీస్ చేసిన నాగ్ కి నిర్ణయం, కిల్లర్ మూవీస్ తప్ప మిగిలినవేవీ హిట్ కాలేదు. అదే సమయంలో పక్కా మాస్ మూవీ ప్రెసిడెంట్ గారి పెళ్ళాం హిట్ ఇచ్చింది. దాంతో మాస్ కథలతో రావాలని ప్రొడ్యూసర్స్ కి చెప్పేసారు.

ఇక అక్కినేని వీరాభిమాని డి శివప్రసాదరెడ్డి ఇక ఆలస్యం చేయకుండా ప్రెసిడెంట్ గారి పెళ్ళాం కథ రాసిన తోటపల్లి మధుకి మద్రాసులో ఓ రూమ్ తీసి, నాగ్ కి మంచి మాస్ కథ చేయమని చెప్పేసారు. దాంతో అత్తా అల్లుడు మధ్య సరదా సీన్స్ తో కథ రెడీ చేసారు. నిర్మాతకు, నాగ్ కి నచ్చేయడంతో కోదండరామిరెడ్డి డైరెక్టర్ గా సినిమాకు రెడీ అయ్యారు. మీనా, నగ్మా హీరోయిన్స్ . కీరవాణి మ్యూజిక్.

పొగరుబోతు అత్తగా బ్రాండ్ అంబాసిడర్ గా నిల్చిన వాణిశ్రీ, మురళీమోహన్, రావు గోపాలరావు, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, బాబు మోహన్, చలపతిరావు తారాగణం. 1993ఏప్రియల్ లో షూటింగ్ స్టార్ట్. చెన్నై ఏవిఎం స్టూడియో, ముదుమలై పార్క్, ఊటీ, హైదరాబాద్ అన్నపూర్ణ, పద్మాలయ స్టూడియోస్, రాజమండ్రిలలో షూటింగ్ చేసారు. చాలా టైటిల్స్ అనుకున్నా చివరకు అల్లరి అల్లుడు పేరుతొ నాగ్ పుట్టినరోజు ఆగస్టు 29న పోస్టర్ రిలీజ్ చేసారు.

ఇక రమ్యకృష్ణ స్పెషల్ సాంగ్ చేశారన్న వార్త సినిమా క్రేజ్ పెంచింది. ఆడియో హిట్. పాటలన్నీ మారుమోగాయి. అక్టోబర్ 6న మూవీ రిలీజ్. అప్పటికే బంగారు బుల్లోడు, అబ్బాయిగారు మంచి టాక్స్ తో హిట్ థియేటర్లలో ఆడుతున్నాయి. దాంతో 72ప్రింట్లతో 142థియేటర్స్ లో విడుదలైంది.

ఈ సినిమాకు ఫాన్స్ హడావిడి ఎక్కువ చేసారు. రాజమండ్రిలో 101అడుగుల కటౌట్ పెట్టడంతో సంచలనంగా మారింది. కటౌట్ చూడ్డానికే థియేటర్ కి చాలామంది వచ్చేవారు. ఇక నాగ్ మాస్ యాక్టింగ్, మాస్ కామెడీ, ఫైట్స్ తో , స్టెప్స్ తో అదరగొట్టేసాడు. మీనా, నగ్మా గ్లామర్, వాణిశ్రీ, రావు గోపాలరావు యాక్టింగ్ ప్లస్ పాయింట్స్. మొదట్లో నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయింది.

మొదటి వారం 1కోటి 10లక్షల షేర్ కలెక్ట్ చేసింది. ఆయా జిల్లాల్లో , హైదరాబాద్ లో రికార్డ్ క్రియేట్ చేసింది. బి సెంటర్స్ లో మొదటి వారం భారీ రికార్డ్స్ . సీడెడ్ లో 70లక్షలు కలెక్ట్ చేసి రాయలసీమ రికార్డ్ క్రియేట్ చేసింది. 22సెంటర్స్ లో 100డేస్ ఆడింది. టోటల్ గా 7కోట్ల 20లక్షల షేర్ కలెక్ట్ చేసింది. 1993టాప్ గ్రాసర్ గా ఆల్ టైం టాప్ 4మూవీగా నిల్చింది. నాగ్ మాస్ మూవీస్ కి ప్రధాన కారణం అల్లరి అల్లుడు హిట్.
Click Here To Follow Chaipakodi On Google News