Ginger Tea:అల్లం టీ ఎక్కువగా తాగుతున్నారా…అయితే ఈ విషయాలు తెలుసుకోండి
Ginger Tea Benefits:అల్లంలో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ సీజన్ లో అల్లంను లిమిట్ గా తీసుకుంటే సీజనల్ గా వచ్చే సమస్యలు ఏమి రాకుండా ప్రశాంతంగా ఉండవచ్చు. మనకు అల్లం సంవత్సరం పొడవునా లభ్యం అవుతుంది. కాబట్టి ఈ సీజన్ లో అల్లం తీసుకోని ఇప్పుడు చెప్పే ప్రయోజనాలను పొందండి. అయితే అల్లంను లిమిట్ గానే తీసుకోవాలి. ఈ విషయాన్నీ తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.
రోజులో రెండు కప్పుల కంటే ఎక్కువ అల్లం టీ తాగకూడదు. దీని కంటే ఎక్కువ తీసుకోవటం వలన శరీరంలో బైల్ అధిక మొత్తంలో విడుదల చేయబడుతుంది. కానీ దీనికి నిరూపించే ఆధారాలు లేవు కానీ, పైన తెలిపిన స్థాయికి మించిన మోతాదులో తాగే ముందు వైద్యుడిని సంప్రదించండి.
కొంతమందిలో అల్లం టీ కారణంగా హృదయ స్పందనలో మార్పులతో పాటూ, పొట్టలో కలతలకు గురి చేస్తుంది. ఎందుకంటే అల్లం మంటను కలిగించే గుణాలను కలిగి ఉంటుంది. ఒకవేళ మీరు అలర్జీలను కలిగి ఉంటే, అల్లం టీ తాగటం వలన స్కిన్ రషెస్ నోట్లో లేదా కడుపులో చికాకులను కలిగిస్తుంది.
అల్లంటీ రక్తపోటును తగ్గిస్తుంది. కావున మైకానికి గురయ్యే అవకాశం కూడా లేకపోలేదు.అల్లం సాలిసిలేట్ లను కలిగి ఉంటుంది. ఇవి రక్తాన్ని పలుచగా చేస్తాయి. కావున బ్లీడింగ్ సమస్యలను కలిగి ఉండే వారు అల్లంటీ కి దూరంగా ఉండాలి. అల్లం టీని లిమిట్ గా తీసుకుంటే ఎటువంటి ప్రమాదం ఉండదు.
అల్లంను మనం రెగ్యులర్ గా చేసుకొనే టీలో వేసుకొని తాగవచ్చు.ఏదైనా లిమిట్ గా తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అందువల్ల రోజుకి ఒక కప్పు అల్లం టీ తాగితే సరిపోతుంది. అల్లం రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. అల్లం టీ తాగితే దగ్గు, జలుబు వంటి అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
అలాగే రోగ నిరోధక శక్తిని పెంచడంలో అల్లం టీ ఎంతో ఉపయోగపడుతుంది. అల్లం మనకు సులువుగానే లభ్యం అవుతుంది. కాబట్టి అల్లం టీ తాగవచ్చు. అయితే అన్నింటికి మంచి కదా అని ఎక్కువగా తాగడం వల్ల అనర్థాలు కూడా ఉండే అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.