Healthhealth tips in telugu

Dates With Honey:ఉదయం లేవగానే తేనె, ఖర్జూరం కలిపి తింటే ఒకటి కాదు ఊహించని ఎన్నో లాభాలు

Dates With Honey Benefits: ఉదయం సమయంలో తీసుకొనే ఆహారం మన ఆరోగ్యం విషయంలో ప్రముఖమైన పాత్రను పోషిస్తుంది. మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటే అలసట,నీరసం లేకుండా రోజంతా హుషారుగా ఉంటాం. సీజన్ మారినప్పుడు తీసుకొనే ఆహారం విషయంలో శ్రద్ద పెట్టాలి.

చలికాలంలో విపరీతమైన చలి కారణంగా ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యలను తగ్గించుకోవటానికి ఆహారంలో మార్పులు తప్పనిసరిగా తీసుకోవాలి. దగ్గు, జలుబు, గొంతు నొప్పి, కీళ్ల నొప్పులు వంటివి ఎక్కువగా ఉంటాయి.

ఖర్జూరంలో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. తేనెలో కూడా ఎన్నో పోషకాలు,ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయి. ఒక గాజు సీసాలో మూడు వంతులు తేనెను పోసి దానిలో ఒక వంతు గింజ తీసిన ఖర్జూరం వేసి బాగా కలపాలి.

బాగా కలిపిన తర్వాత మూతపెట్టి వారం రోజులు కదలకుండా ఉంచాలి. వారం తర్వాత రోజుకు ఒకటి లేదా రెండు చొప్పున తినాలి. ఇలా తింటే శరీరంలో వేడి తగ్గుతుంది. మలబద్దకం సమస్య ఉన్నవారు రాత్రి సమయంలో తింటే పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరిగి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యి మలబద్దకం సమస్య తగ్గుతుంది. అలాగే గ్యాస్,ఎసిడిటీ సమస్యలు తగ్గుతాయి.

కాల్షియం, ఐరన్‌ సమృద్దిగా ఉండుట వలన మెదడు చురుగ్గా పనిచేసి మెమొరీ పవర్ పెరుగుతుంది. రక్తహీనత సమస్య తగ్గుతుంది. అంతేకాకుండా ఎముకలకు సంబందించిన సమస్యలు ఉండవు. కీళ్ల నొప్పులు,మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి వంటివి తగ్గుతాయి. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

ఆకలి లేనివారిలో ఆకలిని పెంచుతుంది. ఉదయం సమయంలో తీసుకుంటే అలసట,నీరసం,నిసత్తువ వంటివి లేకుండా రోజంతా హుషారుగా ఉంటారు. వీటిని తీసుకుంటే తక్షణ శక్తి లభిస్తుంది. కాబట్టి ఈ సీజన్ లో ఖర్జూరం, తేనె కలిపి తీసుకోవటానికి ప్రయత్నం చేసి ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలను పొందండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News