Devotional

Raksha Bandhan 2023: ఈ సంవత్సరం రాఖీ పండుగ ఎప్పుడు వచ్చింది…ఏ సమయంలో కట్టాలి…?

Raksha Bandhan 2023: ప్రతి సంవత్సరం రాఖీ పండుగను సోదర సోదరీమణుల అనుబంధానికి గుర్తుగా జరుపుకుంటారు. రాఖీ పండుగ ప్రతి సంవత్సరం శ్రావణ మాసం పౌర్ణమి రోజున వస్తుంది. ఆ రోజున అక్కాచెల్లెల్లు తమ సోదరులకు రాఖీ కట్టి వారి ఆశీస్సులు తీసుకుంటారు.

అయితే ఈ సంవత్సరం రాఖీ పండుగను ఆగస్టు 30 లేదా 31..ఏ రోజు జరుపుకోవాలో అనే సందేహం మనలో చాలా మందికి ఉంది. ఆగస్టు 30న ప్రారంభమై..ఆగస్టు 31 వరకు ఉండుట వలన రెండు రోజుల పాటు రాఖీ పండుగను జరుపుకోవచ్చు. అయితే ఈ సమయంలో కడితే మేలు జరుగుతుందో తెలుసుకుందాం.

రాఖీ పండుగ యొక్క శుభ సమయం ఆగస్టు 30న రాత్రి 09:01 గంటల ప్రారంభమై..ఆగస్టు 31 ఉదయం 07:05 వరకు ఉంటుంది. ఈ సమయంలో మీరు ఎప్పుడైనా మీ సోదరుడికి రాఖీ కట్టవచ్చు. ఆగస్టు 30న ఉదయం 10.58 గంటల నుంచి రాత్రి 09.01 గంటల వరకు భద్ర కాలం ఉండుట వలన ఆ సమయంలో రాఖీ కట్టకూడదు.

క్లిక్ చేయండి—-అందమైన రాఖీ కోసం