Healthhealth tips in telugu

Facts About palak Paneer:పాలక్ పనీర్ ఎక్కువగా తింటున్నారా…ఈ విషయం తెలుసుకోండి

Facts About palak Paneer:పాలక్ పనీర్ ని రోటి మరియు పలావ్,ఫ్రైడ్ రైస్ వంటి వాటిలో ఎక్కువగా తింటూ ఉంటారు. పాలకూర,పనీర్ రెండూ కూడా ఆరోగ్యానికి మంచిదని ఒక భావన ఉంది. ఈ రెండింటిలోను ఎన్నో పోషకాలు ఉన్నాయి. అయితే ఎక్కువగా తింటే ఏమి జరుగుతుందో తెలుసుకుందాం.

మనలో చాలా మంది ఆరోగ్యానికి మంచి చేస్తుందని పాలక్ పనీర్ ఎక్కువగా తింటూ ఉంటారు.అయితే ఇలా తినటం వలన కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా కొన్ని సమస్యలు ఉన్నవారు పాలక్ పనీర్ కి దూరంగా ఉంటేనే మంచిదని నిపుణులు చెప్పుతున్నారు.

పాలక్ పనీర్ చాలా రుచికరంగా ఉంటుంది. అలాగే పాలకూర, పనీర్ రెండింటిలోను ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఈ రెండింటినీ కలిపి తింటే కొన్ని సమస్యలు వస్తాయి. పాలకూర, పనీర్ తినడం వల్ల ఐరన్ మరియు క్యాల్షియం శరీరానికి అందుతాయి. అయితే పనీర్ లో ఉండే కాల్షియం శరీరం ఐరన్ శోషించుకోవటానికి అడ్డు పడుతుంది.

దాని పలితంగా ఐరన్ శరీరం శోషించబడకుండానే బయటకు వెళ్లిపోతుంది. దాని కారణంగా ఐరన్ లోపం ఏర్పడుతుంది. పాలక్ పనీర్ కి బదులుగా పాలక్ బంగాళాదుంప, పాలక్ మొక్కజొన్న తినవచ్చు. ఏ ఆహారాలను ఏ ఆహారాలతో కలిపి తినాలో పోషకాహార నిపుణుల సలహా తీసుకోవాలి. ఆహారంలో ఉండే పోషకాలు ఒకదానికొకటి శోషణను అడ్డుకుంటాయి.

పాలక్ పనీర్ తినడం వల్ల శరీరం ఐరన్ ని గ్రహించదు. అదే విధంగా పాలకూరలోని ఆక్సాలిక్ యాసిడ్ పనీర్‌లోని కాల్షియంను ఉపయోగించడానికి అనుమతించదు. ఈ కాల్షియం కిడ్నీలో పేరుకుపోయి రాళ్లు ఏర్పడటం ప్రారంభిస్తాయి. దాంతో కిడ్నీలో రాళ్ళ సమస్య ప్రారంభం అవుతుంది. పాలకూర ఎక్కువగా తినడం వల్ల గ్యాస్, కిడ్నీలో రాళ్లు, కీళ్ల నొప్పులు, రక్తం గట్టిపడటం, కడుపు ఉబ్బరం, తిమ్మిర్లు వంటి సమస్యలు వస్తాయి.

పాలకురను తినేటప్పుడు కొన్ని విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. క్యాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలతో పాలకూరను కలిపి తినకూడదు. అలాగే కిడ్నీలో రాళ్ళ సమస్య ఉన్నవారు,రక్తహీనత సమస్య ఉన్నవారు పాలక్ పనీర్ తినకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తేనే మంచిది. పాలకూర,పనీర్ రెండింటిలోను పోషకాలు ఉన్నప్పటికి కలిపి తినకూడదు.

ఇది కూడా చదవండి: Mosquitoes : ఇలా చేస్తే.. మీ ఇంట్లోకి ఒక్క దోమ కూడా రాదు..నిమిషంలో పారిపోతాయి

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News