Weight Loss:5 రూపాయిల ఖర్చుతో ఎంతటి వేలాడే పొట్ట, నడుం చుట్టూ ఉన్న కొవ్వును మైనంలా కరిగించవచ్చు
Weight Loss Tips In telugu:ప్రతి రోజు వ్యాయామం చేయకపోవటం, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినటం, ఎక్కువసేపు అలా కూర్చొని ఉండటం వంటి కారణాలతో మనలో చాలా మంది ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నారు. ఈ రోజుల్లో వయస్సుతో సంబందం లేకుండా ప్రతి ఒక్కరూ అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు.
బరువు మరియు శరీరంలో అదనంగా పెరుకుపోయిన కొవ్వును కరిగించుకోవటానికి ఎన్నో రకాల ప్రయత్నాలను చేస్తూ ఉంటారు. అయిన పెద్దగా ఫలితం ఉండదు. ప్రతి రోజు వ్యాయామం చేస్తూ మంచి పోషకాహారం తీసుకుంటే ఇప్పుడు చెప్పే మసాలా దినుసులను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇవన్ని మనకు వంటింటిలో సులభంగా అందుబాటులో ఉండేవే.
పసుపు
పసుపును మనం ప్రతిరోజు వంటింట్లో వాడుతూ ఉంటాం. పసుపులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. పసుపును ప్రతిరోజు తీసుకుంటే అధిక బరువు సమస్య నుంచి బయటపడవచ్చు. ప్రతిరోజు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు వేసి బాగా కలిపి తాగాలి. అలా కాకుండా గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు వేసి బాగా కలిపి తాగవచ్చు.
దాల్చిన చెక్క
దాల్చిన చెక్క అధిక బరువు సమస్యను అలాగే శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వును తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. పొయ్యి మీద ఒక గ్లాస్ నీటిని పెట్టి దానిలో మూడు చిన్న చిన్న దాల్చిన చెక్క ముక్కలు వేసి ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు బాగా మరిగించాలి. ఇలా మరిగించడం వలన దాల్చిన చెక్క లో ఉన్న పోషకాలు అన్ని నీటిలోకి చేరతాయి ఈ నీటిని వడకట్టి ప్రతిరోజూ తాగుతూ ఉండాలి. ఈ విధంగా తాగుతూ ఉంటే బరువు తగ్గొచ్చు
మెంతులు
మెంతులలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి మెంతులు బరువు తగ్గడానికి సహాయపడుతాయి మెంతులు తీసుకోవడం వల్ల తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యి కొవ్వుగా మారకుండా శక్తిగా మారుతుంది. ఆ విధంగా బరువు తగ్గడానికి మెంతులు సహాయపడతాయి. మెంతులను అరస్పూను తీసుకుని రాత్రి సమయంలో ఒక గ్లాసు నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం నానిన మెంతులను తింటూ ఆ నీటిని తాగాలి.
ఈ విధంగా రెండు వారాలపాటు మెంతులు, పసుపు,దాల్చిన చెక్క తీసుకుంటూ ఉంటే అధిక బరువు సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే శరీరంలో అదనంగా పెరుకుపోయిన కొవ్వు కూడా కరిగిపోతుంది. ఈ మూడు మన వంటింటిలో సులభంగా అందుబాటులో ఉంటాయి. కాస్త శ్రద్ద,సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News