Healthhealth tips in telugu

Morning Coffee:ఉదయం లేవగానే వేడి వేడిగా కాఫీ తాగుతున్నారా…ఈ నిజం తెలిస్తే…?

Morning Coffee benefits: మనలో చాలా మందికి ఉదయ కాఫీ తాగే అలవాటు ఉంటుంది. ఉదయం సమయంలో కాఫీ తాగితే కొన్ని ప్రయోజనాలను పొందవచ్చు. అయితే కాఫీని మితంగానే తాగాలి. ఉదయం లేవగానే వేడి వేడిగా కాఫీ త్రాగితే ఆ రోజు అంతా ఉల్లాసంగా,ఉత్సాహంగా ఉంటుంది. చాలా మంది ఉదయమే కాకుండా బద్ధకంగా అనిపించినప్పుడు, తలనొప్పి వచ్చినప్పుడు, పని ఒత్తిడిలో ఉన్నప్పుడు.. ఇలా అనేక  సందర్భాలలో కాఫీ తాగి వెంటనే ఉల్లాసాన్ని పొందుతుంటారు.

అయితే చాలా మంది కాఫీ త్రాగితే మంచిది కాదని అంటూ ఉంటారు. దానికి కారణం కాఫీలో కెఫీన్ ఉండటమే. కెఫీన్ ఎక్కువైతే  నిద్ర తగ్గటం,శరీరం డీహైడ్రేషన్ బారిన పడటం వంటి సమస్యలు వస్తాయి. అయితే మితంగా తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. కాఫీలో కొన్ని రకాల యాంటీఆక్సిడెంట్స్ ఉండుట వలన కొన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

అయితే కాఫీ మితంగా త్రాగితేనే ఈ ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఎక్కువగా త్రాగితే ప్రతికూల ప్రభావాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు కాఫీ త్రాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం. కాఫీ  మూడ్, మెమరీ, అలర్ట్నెస్ మరియు రియాక్షన్ టైమ్ వంటి విషయాల్లో చురుకుగా ఉంటుంది. అందువల్లే పనిచేసే వారు సహజంగా కాఫీని ఎక్కువగా  త్రాగుతూ ఉంటారు.

ఒక కప్పు త్రాగితే జీర్ణ క్రియలు బాగా జరిగి తక్షణ శక్తిని అందిస్తుంది. అలసటను తగ్గిస్తుంది. కాఫీలో ఉండే కెఫీన్ రక్తంలో కలిసినప్పుడు వెంటనే మెదడుకు చేరి మెదడు చురుకుగా పనిచేస్తుంది. దాంతో అలసట తగ్గుతుంది. కాఫీలో ఉండే కెఫీన్ బ్లాక్ అయిన నరాలను తెరచుకొనేలా చేసి నరాలను ఉత్తేజ పరుస్తుంది. కాఫీని మితంగా తీసుకుంటే కాలేయానికి రక్షణ కలిగిస్తుంది. డిప్రెషన్ లో ఉన్నప్పుడు ఒక కప్పు కాఫీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది.

కాఫీ బరువు తగ్గించటంలో కూడా సహాయపడుతుంది. కాఫీని ఒక బర్నింగ్ ఏజెంట్ గా చెప్పవచ్చు. శరీరంలో కెఫీన్ వేడి పుట్టించి జీవక్రియలను వేగవంతం చేసి కొవ్వును విచ్ఛిన్నం చేసి కొవ్వు కరగటానికి సహాయపడుతుంది. అయితే బరువు తొందరగా తగ్గాలనే ఉద్దేశంతో ఎక్కువగా కాఫీని త్రాగకూడదు. మితంగా మాత్రమే త్రాగాలి. కాఫీ తక్కువ బ్లడ్ షుగర్ పదార్ధాలను కలిగి ఉంది.

అందువల్ల మధుమేహం ఉన్నవారు రెగ్యులర్ గా అంటే సరైన మోతాదులో కాఫీ త్రాగితే రక్తంలో చక్కర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.కాఫీలో  పొటాషియం, మెగ్నీషియం, పాంథోనిక్ యాసి, నియాసిన్, మెగ్నీషియం, మరియు రిబోఫ్లివిన్, వంటి ఎక్కువగా ఉండి ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనాలను కలిగిస్తాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News