MoviesTollywood news in telugu

Tollywood Heroes:40 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోని టాలీవుడ్ హీరోలు !

Tollywood heroes: పెళ్లి అనేది జీవితంలో ఒక బాగం కావాలి. అయితే ప్రస్తుత కాలంలో సినీ పరిశ్రమలో ఉన్న స్టార్ హీరోలు కొంత మంది వయస్సు పెరుగుతున్నా పెళ్లి చేసుకోవటానికి సిద్దంగా లేరు. పెళ్లి మాటను దాటవేస్తూ సినిమాలతో బిజీగా గడిపేస్తున్నారు. ఆ హీరోలు ఎవరో చూద్దాం.

పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ 43 సంవత్సరాలు దాటిన పెళ్లి మాట ఎత్తటం లేదు. సినిమాలు చేస్తూ బిజీగా గడిపేస్తున్నాడు.

45 సంవత్సరాలు విశాల్ కూడా పెళ్లిని వాయిదా వేస్తున్నాడు. మొదట ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ తో ప్రేమలో ఉండి వివాహం చేసుకుంటామని ప్రకటించినా…ఆ తర్వాత విబేదాలు వచ్చాయి. ఆ తర్వాత 2019లో వైజాగ్ అమ్మాయి అనిషాతో ఎంగేజ్మెంట్ చేసుకున్న పెళ్లి వరకు వెళ్ళలేదు.

45 సంవత్సరాలు ఉన్న సుబ్బరాజ్ కూడా పెళ్ళికి దూరంగానే ఉన్నాడు. పెద్దల బలవంతంతో కాకుండా నాకు నచ్చినప్పుడే పెళ్లి చేసుకుంటానని సుబ్బరాజు అంటూ ఉంటాడు.

సుమంత్ కీర్తి రెడ్డిని వివాహం చేసుకున్నా…ఇద్దరికీ సెట్ అవ్వక విడాకులు తీసుకున్నారు. 48 సంవత్సరాలు వచ్చినా ఇంకా సుమంత్ పెళ్లి జోలికి వెళ్ళటం లేదు.

హీరో సిద్ధార్థ్ 2003లో మేఘన అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో 2007లో విడిపోయారు. ఇతని వయసు 44 సంవత్సరాలు. ఇక విడాకుల అనంతరం సిద్ధార్థ్ మళ్లీ పెళ్లి మాట ఎత్తడం లేదు.

https://www.chaipakodi.com/

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."