Healthhealth tips in telugu

Weight loss Drink : ఉదయానే పరగడపున ఈ డ్రింక్ తాగితే కొవ్వు కరగాల్సిందే..

Weight Loss Drink:అధిక బరువు కారణంగా ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. ఆ సమస్యలు రాకుండా ఉండాలంటే అధిక బరువు సమస్య నుండి బయట పడాలి. అధిక బరువు సమస్యను తగ్గించుకోవటానికి ఇప్పుడు చెప్పే డ్రింక్ బాగా సహాయపడుతుంది.

ఈ మధ్య కాలంలో మనలో చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. అధిక బరువు కారణంగా ఎన్నో సమస్యలు వస్తాయి. సహజసిద్దంగా బరువు తగ్గటానికి ఒక మంచి చిట్కా తెలుసుకుందాం. ఈ రెమిడీ కోసం మూడు ఇంగ్రిడియన్స్ ఉపయోగిస్తున్నాం. ఎలా చేయాలి…ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.

ఒక స్పూన్ వాము, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ సొంపులను మిక్సీ జార్ లో వేసి మెత్తని పౌడర్ గా చేసుకోవాలి. ఈ పొడిని ఎక్కువ మొత్తంలో తయారుచేసుకొని నిల్వ చేసుకోవచ్చు. పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి తయారుచేసి పెట్టుకున్న పొడిని అరస్పూన్ వేసి 5 నుంచి 6 నిమిషాల పాటు మరిగించాలి.

మరిగిన ఈ నీటిని వడకట్టి ఉదయం లేదా సాయంత్రం సమయంలో తాగాలి. ఈ విధంగా తాగుతూ ఉంటే అధిక బరువు సమస్య నుండి బయట పడవచ్చు. రుచి కోసం తేనెను కలుపుకోవచ్చు. అయితే డయబెటిస్ ఉన్నవారు తేనె లేకుండా తీసుకోవాలి. వాము శరీరంలో పెరుకుపోయిన కొవ్వును కరిగించటంలో సహాయపడుతుంది.

జీలకర్ర తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేయటమే కాకుండా బరువు తగ్గినప్పుడు ఎముకలు బలహీనంగా మారకుండా సహాయ పడుతుంది. ఇక సొంపు తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేసి కడుపు ఉబ్బరం వంటి సమస్యలు లేకుండా చేస్తుంది. చాలా మందికి భోజనం తర్వాత సొంపు తినే అలవాటు కూడా ఉంటుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News