Kitchenvantalu

Dahi Aloo Masala Curry:హోటల్ స్టైల్ దహీ ఆలూ మసాలా కర్రీ..చపాతీ,రోటీలలోకి చాలా బాగుంటుంది

Dahi Aloo Masala Curry Recipe: ప్రతి కిచెన్ లో కంపల్సరీగా ఉండే, వెజిటేబుల్స్ లో పొటాటో ముందు ఉంటుంది. ఆలుతో ఏ వెరైటీ చేసినా, రుచి మాత్రం అదుర్స్.
పొటాటో పెరుగుతో, గ్రేవీ కర్రీ చేసి చూడండి.అదిరిపోతుంది.

కావాల్సిన పదార్ధాలు
బేబీ బంగాళదుంపలు – 300 గ్రాములు
(80 శాతం ఉడికినవి)
ఇంగువ – రెండు చిటికెలు
ఉప్పు – కొద్దిగా
పెప్పర్ పొడర్ – ½ టీ స్పూన్
నూనె – 3 టేబుల్ స్పూన్స్
జీలకర్ర – ½ టీ స్పూన్
కలోంజి సీడ్స్ – 2 చిటికెలు
తిరిగిన ఉల్లిపాయలు – 1 కప్పు
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి – 5
ఉప్పు – తగినంత
పసుపు – 1 టీ స్పూన్
గరం మసాలా – ½ టీ స్పూన్
ధనియాల పొడి – 1 స్పూన్
వేయించిన జీలకర్ర పొడి – ½ టీ స్పూన్
టమాటో పేస్ట్ – ½ కప్పు
పెరుగు – 300 గ్రాములు

తయారీ విధానం
1. స్టవ్ ఆన్ చేసుకుని, ఒక పాన్ పెట్టి, కొద్దిగా నూనె వేసుకుని, అందులోకి ఉడికించిన బంగాళదుంపలు వేసుకోవాలి.

2. అవి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చినప్పుడు ఇంగువ, ఉప్పు, మరియు మిరియాల పొడి వేసి,వేయించి పక్కన పెట్టుకోవాలి.

3. ఇప్పుడు అదే బాండీలోకి రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని,అందులోకి కలోంజి సీడ్స్, జీలకర్ర , ఉల్లిపాయలు వేసుకుని, బాగా వేగనివ్వాలి.

4. ఉల్లిపాయలు వేగాక, అందులోకి అల్లం వెల్లుల్లిపేస్ట్ యాడ్ చేసుకోవాలి.

5. తర్వాత ఉప్పు జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాల, పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి.

6. అవి వేగిన తర్వాత, టమాటో పేస్ట్ ను, వేసుకుని, నూనె పైకి తేలేవరకు, వేయించాలి.

7. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న బంగాళదుంపలను వేసి మూడు నిముషాలు కలుపుకోవాలి

8. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి, అందులోకి మెత్తని పెరుగు వేసి, కూరను బాగా కలపాలి.

9. ఇప్పుడు మళ్లీ స్టవ్ ఆన్ చేసుకుని, నూనె పైకి తేలేంత వరకు ల్లో ఫ్లేమ్ లో నూనె పెట్టి ఉడికించాలి.

10. చివరగా కొత్తిమీర జల్లుకుని, స్టవ్ ఆఫ్ చేసి కర్రీ సెర్వ్ చేయడమే.