Kitchenvantalu

Uggani Recipe:రాయలసీమ స్పెషల్ ఉగ్గాని ఈ పొడితో సూపర్ గా ఉంటుంది

Rayalaseema Special Uggani Recipe: కొన్ని కొన్ని వంటకాలు, ఏ ప్రాంతం వారు కనిపెట్టినా,మరే చోటనో గుర్తింపు తెచ్చుకుంటాయి. అలాంటి వెరైటీ స్నాక్ ఐటెమ్ ఉగ్గాని. కర్నాటక వంటకం అయినప్పటకీ, కర్నూలుకు ఫేమస్ గా మారిపోయింది. ఇంతకీ మీరు ఎప్పుడైనా ఉగ్గాని ట్రై చేసారా..లేకపోతే ఇప్పుడే చేయండి.

కావాల్సిన పదార్థాలు
బొరుగులు – 200 గ్రాములు
ఉల్లిపాయ – 1
టమాటో ముక్కలు – 1/2కప్పు
పచ్చిమిర్చి – 5
కరివేపాకు – 2 రెబ్బలు
ఆవాలు – 1 టీస్పీన్
జీలకర్ర – 1 టీ స్పూన్
ఎండుమిర్చి – 2
ఉప్పు – తగినంత
కారం – ½ టీ స్పూన్
నూనె – 2 టేబుల్ స్పూన్స్
పుట్నాల పప్పు – 1/2కప్పు
ఎండుకొబ్బరి పొడి – 2 టేబుల్ స్పూన్స్
కొత్తిమీర – కొద్దిగా

తయారీ విధానం
1.ముందుగా బురుగులను ఒక గిన్నెలో వేసి, నీళ్లు పోసి, 3 నిముషాలు నాననివ్వాలి.
2. నానాపెట్టిన బురుగులను నీళ్లు లేకుండా గట్టిగా పిండి, వేరొక గిన్నెలోకి వేసుకోవాలి.
3.ఇప్పుడు ఆ బురుగుల్లోకి కొద్దిగా ఉప్పు కలిపి పక్కన పెట్టుకోవాలి.
4. ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు, కచ్చా పచ్చాగా దంచి పక్కన పెట్టుకోండి.
5. ఇప్పుడు ఒక మిక్సీ జార్ లోకి పుట్నాల పప్పు, ఎండుమిర్చి, ఎండుకొబ్బరి వేసి మెత్తని పొడి చేసుకోండి.
6. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టుకుని, అందులో నూనె వేసి వెడెక్కిన తర్వాత ఆవాలు, ఎండుమిర్చి ముక్కలు,జీలకర్ర, కరివేపాకు వేసి, వేపుకోవాలి.

7. ఇప్పుడు అందులోకి ఉల్లిపాయ తరుగు, రెబ్బ కరివేపాకు, మరో రెండు నిముషాలు వేపాలి.
8. ఇప్పుడు అందులోకి టమాటో ముక్కలు ,పసుపు, పచ్చిమిర్చి ముద్ద, కారం, వేసుకుని, పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి.
9. టమాటో మెత్తపడిన తర్వాత, నాన బెట్టిన బురుగులు, గ్రైండ్ చేసుకున్న పప్పుల పొడి, ఒక రెండు టీ స్పూన్స్, వేసి ఉప్పు, యాడ్ చేసి హై ఫ్లైమ్ పై టాస్ చేసుకోవాలి.
10. చివరగా కొత్తిమీర జల్లుకుని, వేడి వేడిగా సెర్వ్ చేసుకోవడమే.