Healthhealth tips in telugu

Weight Loss:ఒక గ్లాసు తాగితే మీరు తిన్న ఆహరం కొవ్వుగా అస్సలు మారదు.. తెలుసా?

Weight Loss Drink: ఈ మధ్య కాలంలో అధిక బరువు సమస్య అనేది ప్రధానమైన సమస్యగా మారిపోయింది. బరువు పెరగటం అనేది చాలా త్వరగా జరుగుతుంది. అదే బరువు తగ్గాలంటే మాత్రం చాలా కష్టం అవుతుంది.

ఉదయం నుంచి తిన్న ఆహారం సులభంగా జీర్ణమై అందులో కొవ్వు కరిగిపోయేలా చేసేందుకు ఓ డ్రింక్ ను ఉపయోగించొచ్చని ఆయుర్వేద నిపుణులు చెపుతున్నారు. ఇంట్లో సులభంగా తయారు చేసుకొనే ఆ డ్రింక్ ఏంటో చూద్దాం.

కావలసిన పదార్ధాలు:
నిమ్మకాయ – 1
కొత్తమీర రసం – ఒక గ్లాస్
దాల్చిన చెక్క పొడి

తయారీ విధానం: నిమ్మకాయ రసం, కొత్తిమీర రసం, దాల్చిన చెక్క పొడి, కలిపి మిశ్రమంలా తయారు చేయాలి. రాత్రి పడుకోవటానికి ఓ గంట ముందు ఈ మిశ్రమాన్ని తాగాలి. వారం రోజులపాటు ఇలా చేస్తే అద్బుతమైన ఫలితాలు కనపడతాయి. శరీరంలో మెటబాలిజం పెరుగుతుంది. ఈ డ్రింక్ రాత్రంతా జీర్ణక్రియలో కొవ్వును కరిగిస్తుంది. రాత్రి భోజనం చేసిన 2 గంటల తర్వాత, నిద్రపోయే గంట ముందు ఈ డ్రింక్ తాగితే ఫలితం మెరుగ్గా కనిపిస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News