Beauty Tips

White hair:తెల్ల జుట్టు వేధిస్తోందా? ఈ చిట్కా పాటిస్తే.. మీ జుట్టు వెంటనే నల్లగా మారుతుంది.

White Hair Turn Black Home Remedies:తెల్లజుట్టు సమస్య రాగానే మనలో చాలా మంది కంగారు పడిపోతూ ఉంటారు. అలా కంగారు పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే కాస్త శ్రద్ద పెడితే ఇంటి చిట్కాలు చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి.

ఒక గిన్నెలో మూడు స్పూన్ల బీట్ రూట్ రసం, ఒక స్పూన్ మెంతులు,7 స్పూన్ల సెలెరీ, 10 కరివేపాకు ఆకులు , కొంచెం నీటిని వేసి పొయ్యి మీద పెట్టి ఉడికించాలి. ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్ లో వేసి మెత్తని పేస్ట్ గా చేయాలి.

ఈ పేస్ట్ లో ఏడు స్పూన్ల కొబ్బరి నూనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు బాగా పట్టించి గంట తర్వాత కుంకుడు కాయలు లేదా హెర్బల్ షాంపూ తో తలస్నానం చేయాలి.

ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే తెల్లజుట్టు సమస్య క్రమంగా తగ్గుతుంది. అలాగే జుట్టు కుదుళ్ళు బలంగా మారి జుట్టు రాలకుండా ఒత్తుగా,పొడవుగా పెరిగేలా చేస్తుంది.

ఈ చిట్కాలో ఉపయోగించిన అన్ని ఇంగ్రిడియన్స్ లో ఉన్న పోషకాలు జుట్టు సమస్యలను తగ్గించటానికి సహాయపడతాయి. కాబట్టి కాస్త ఓపికగా చేసుకుంటే మంచి పలితాన్ని పొందవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."